Priyanka Singh Nagababu : ఆయన నాకు దేవుడు.. నాగబాబు పై ప్రియాంక సింగ్ కామెంట్స్ వైరల్?

జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసినటువంటి వారిలో కమెడియన్ సాయి తేజ( Sai Tej ) ఒకరు.సాయి తేజ అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ ప్రియాంక సింగ్ ( Priyanka Singh ) అంటే అందరికీ ఈమె గుర్తుకు వస్తారు.

 Priyanka Singh Sensational Comments On Nagababu-TeluguStop.com

జబర్దస్త్ కార్యక్రమంలో సాయితేజగా గుర్తింపు పొంది లేడి గెటప్స్ లో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయిగా మారాలని కోరిక కలగడంతో డబ్బులు అన్ని దాచుకొని సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారిపోయారు.

ఇలా అమ్మాయిగా మారిపోయిన ఈమె తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇకపోతే ఈమె బిగ్ బాస్ సీజన్ 5 ( Bigg Boss 5 )కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ కూడా ప్రియాంక సింగ్ బిజీగా గడుపుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రియాంక సింగ్ నాగబాబు ( Naga Babu ) గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాను జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూనే అమ్మాయిగా మారాలని సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమయ్యాను.ఆ సమయంలోనే నేను ఆర్థరైటిస్ తో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాను.ఆ సమయంలో నాగబాబు గారు తనకు చాలా సహాయం చేశారని ఆయన ప్రతినెల నాకు డబ్బులు పంపించేవారు అంటూ ఈ సందర్భంగా ప్రియాంక సింగ్ నాగబాబు గురించి చెప్పడమే కాకుండా ఆయన నాకు దేవుడితో సమానం అంటూ తన పట్ల ఉన్నటువంటి విధేయతను చాటుకున్నారు.

ప్రస్తుతం జబర్దస్త్ కు దూరమైనటువంటి ప్రియాంక సింగ్ పలు సిరీస్ లలో నటిస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube