టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక జవాల్కర్.మొదటి సినిమా భారీ హిట్ అయినప్పటికీ ప్రియాంక కు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు.
ఆ తరువాత సినీ ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గానే ఉంది.ఆ తరువాత ప్రియాంక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేమతో ప్రేక్షకులను అలరించింది.
ఎస్ ఆర్ కళ్యాణ మండపం, తిమ్మరుసు లాంటి సినిమాలతో సూపర్ హిట్ ను అందుకుంది.గమనం సినిమాకు విశ్లేషకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.

అదే విధంగా ఈ సినిమాలోని ప్రియాంక నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఇది ఇలా ఉంటే ప్రియాంక ఇటీవలే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.కరోనా మహమ్మారి కారణంగా రెండు వారాల పాటు ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది.ఇక ఆ సమయంలోనే ప్రియాంక తన అభిమానులకు టచ్ లో ఉంది.ఎప్పుడు సినిమాలతో బిజీ బిజీగా ఉంటూ అభిమానులతో తక్కువగా ముచ్చటించే ప్రియాంక జవాల్కర్ కరోనా సోకినప్పుడు అభిమానులతో ముచ్చట్లు పెట్టింది.ఇక తనకు సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో సినిమాలకు సంబంధించి కెరీర్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా ఈమె సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అంటూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.ఈ క్రమంలోనే ఆమె అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రశ్నలు అడగడం తో ఆమె కూల్ గా సమాధానమిస్తూ వచ్చింది.ఈ క్రమంలోనే ఒక అభిమాని మీరు తిరుపతికి మళ్లీ ఎప్పుడు వస్తున్నారు అని ప్రశ్నించగా.ఈ విషయంపై స్పందించిన ప్రియాంక నేను మిస్ అవుతున్న ఏకైక ప్రదేశం అదే గత రెండేళ్లుగా అక్కడికి రావాలని ఎదురు చూస్తున్నాను అంటూ ప్రియాంక తన మనసులోని కోరికను బయట పెట్టేసింది.
దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







