ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ, పెళ్లి రెండు మధురమైన అనుభూతులు గా చెప్పవచ్చు.అయితే ప్రేమ పెళ్లిళ్ల విషయంలో ఒక్కొక్కరిది ఒక అభిప్రాయం ఉంటుంది.
మరీ ముఖ్యంగా అంటే అమ్మాయిలు వారికి రాబోయే భర్త ఏ విధంగా ఉండాలి అనేది కలలుకంటూ ఉంటారు.వారికి రాబోయే భర్తను కలల రాకుమారుడిగా ఉండాలి, అలాంటి వాడు ఇలాంటి వాడు కావాలి అని అనుకుంటూ ఉంటారు.
అయితే ఎటువంటి భర్త వచ్చినా కూడా భార్యను కామెంట్ చేసే వాడిని మాత్రం అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు.కాని అలాంటి వ్యక్తి నాకు కరెక్ట్ మొగుడు అని అంటోంది బిగ్ బాస్ బ్యూటీ శ్రీ రాపాక.
ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి రెండవ వారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.అయితే తాజాగా శ్రీ రాపాక తన బ్రేక్ అప్ లవ్ స్టొరీ తో పాటు, తాను ఎటువంటి భర్తను కోరుకుంటుందో చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా శ్రీ రాపాక మాట్లాడుతూ.మేము ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని లవ్ చేశాను ఇద్దరం ప్రేమించుకుంన్నాం కానీ కొద్ది రోజులకే బ్రేకప్ అయ్యింది.
ఈ విషయాన్ని బిగ్ బాస్ హౌస్ లో కూడా చెప్పాను.కానీ నేను లవ్ ఫెయిల్యూర్ అని అనను ఎందుకంటే.
ఇద్దరు ఒకే ఫీల్డ్ లో ఉంటే బాగా సెట్ అవుతుందని అనుకున్నాను కానీ అది వర్కవుట్ అవ్వలేదు.ప్రేమించిన అబ్బాయి గురించి నెగిటివ్ గా చెప్పను ఎందుకంటే నాకు ఆ అవకాశం రాలేదు.

ప్రేమించిన వ్యక్తిని ఇండస్ట్రీకి చెందినవాడు మ్యూజిక్ డైరెక్టర్ అది తప్పు వచ్చింది శ్రీ రాపాక.అయితే అలా కొన్ని కొన్ని కారణాల వల్ల మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ ని కంటిన్యూ చేస్తున్నాం.ఇప్పటికీ అలాగే మాట్లాడ కుండా కాల్ చేయకుండా ఉన్నాము.ఇప్పటికీ మా మధ్య గ్యాప్ వచ్చి రెండేళ్లు అవుతోంది.అతను కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నాడు.ఇప్పటి వరకు నాలుగు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు.
ఇద్దరము విడిపోయిన తర్వాత నేను మాస్టర్స్ చేయడం కోసం యూఎస్ వెళ్లిపోగా అతను మాత్రం సినిమాలు చేస్తూ ఉన్నారు అని చెప్పుకొచ్చింది శ్రీ రాపాక.

అనంతరం పెళ్లి గురించి మాట్లాడుతూ నేను ప్రస్తుతం ప్రభాస్ ని లవ్ చేస్తున్నాను.నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే పెద్దగా ఆశలు ఏమీ లేవు మనిషి అయితే చాలు కరెక్ట్ గా ఉండి నాపై కేరింగ్ చూపిస్తే చాలు.అలాగే భర్త అనే వాడు ఎప్పుడూ ఒక అడుగు పైనే ఉండాలి నా డామినేషన్ అనేది ఉండ కూడదు.
అలా ఉంటే లైఫ్ బోర్ వచ్చేస్తుంది అలాంటి లైఫ్ నాకు వద్దు నన్ను కామెంట్ చేసే అబ్బాయి నాకు భర్తగా రావాలి.అలాంటి వాడిని నేను పెళ్లి చేసుకుంటాను.
కమాండ్ చేసే మగాడు ఉంటేనే లైఫ్ కొత్తగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది శ్రీ రాపాక.
.






