తెలంగాణలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా పడింది.వచ్చే నెల 4 లేదా 5వ తేదీన ప్రియాంక గాంధీ హైదరాబాద్ కు రావాల్సి ఉంది.
అయితే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ఉండటంతో తెలంగాణ పర్యటనను వాయిదా వేసినట్లు సమాచారం.ఈ క్రమంలోనే కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత మే 8వ తేదీన ప్రియాంక గాంధీ హైదరాబాద్ కు రానున్నారు.







