బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రియాంక చోప్రా ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.అందులో భాగంగానే తాజాగా ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో( Nick Jonas ) కలిసి అయోధ్య లోని భవ్య రామమందిరంలో కొలువుదీరిన బాలక్ రామ్ ను తాజాగా దర్శించుకుంది.
పసుపు రంగు సంప్రదాయ చీరలో ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది.
ఆమె కట్టుకున్న చీర సింపుల్ గా ఉంది.ప్రియాంక చోప్రా చాలా సింపుల్ గా ఉందంటూ అంతా పోస్టులు పెట్టారు.ఆ ఫోటోలో ప్రియాంక తన కూతుర్ని ఎత్తుకొని కనిపించగా వెనుక వైపు నిక్ జోనస్ కనిపించారు.
అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ ప్రియాంక ధరించిన చీర( Priyanka Chopra Saree ) గురించి చర్చించుకుంటున్నారు.కానీ అంతా అనుకుంటున్నట్టు ప్రియాంక చోప్రా ధరించిన ఆ చీర అంత సింపుల్ కాదు.
దాని ఖరీదు అక్షరాలా 63,800 రూపాయలు.
ప్రియాంక చోప్రా కోసం 10 రోజుల ముందు నుంచే ఈ చీరను డిజైన్ చేయడం స్టార్ట్ చేశారు.ఈ చీర కోసం పూర్తిగా ఆర్గానిక్ మెటీరియల్ ను ఉపయోగించారట.వాడిన ఫ్యాబ్రిక్ తో పాటు, రంగులు కూడా అన్నీ ఆర్గానిక్ వే.చర్మానికి ఎలాంటి హానీ తలపెట్టని మెటీరియల్ ఇది.తన భర్త, కూతురు మేరీ జోనస్ తో కలిసి రామమందిరానికి( Ram Mandir ) వచ్చింది ప్రియాంక చోప్రా.ఆమెను తమ కెమెరాల్లో బంధించేందుకు భక్తులు ఎగబడ్డారు. ప్రియాంక చోప్రా మాత్రం హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయానికి వచ్చి, దేవుడ్ని దర్శించుకుంది.పూజారిని అడిగి మరీ తన భర్తకు నుదుటిపై బొట్టు పెట్టించింది.