ప్రియాంక చోప్రా ఇప్పుడొక ఇంటర్నేషనల్ స్టార్.ఇటు బాలివుడ్ లో, అటు హాలివుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది ప్రియాంక.
కోట్లల్లో ఆస్థి.ప్రపంచవ్యాప్తంగా అభిమానులు .ఇప్పుడన్ని ఉన్నాయి ప్రియాంక దగ్గర.
కాని ఒకప్పుడు ప్రియాంక దగ్గర ఇవేమి లేవు.
అవకాశాల కోసం నానా కష్టాలు పడిందట.ఎన్ని ప్లాన్స్ వేసినా, ఎవరు అవకాశాలు ఇచ్చేవారు కాదట.
ఓ నాలుగుసార్లైనా సూసైడ్ చేసుకుందామనుకుందట ప్రియాంక.ఈ విషయాలన్ని ప్రియాంక మాజి మేనేజర్ ప్రకాష్ జాజూ బయటి ప్రపంచానికి తెలియజేశాడు .ప్రియంక ఆత్మహత్య చేసుకుందామనుకున్న ప్రతీసారి ఆమెను ఆపింది ప్రకాషేనంట.
అయినా, ఎప్పుడో 15-16 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు ఇప్పుడెందుకు గుర్తొచ్చాయి ప్రియాంక మాజి మేనేజర్ కి అనేకదా మీ అనుమానం.
టీవి నటి ప్రత్యూష బెనర్జీ మొన్న సూసైడ్ చేసుకుంది కదా … ఆవిడ గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రియాంక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాడు ప్రకాష్ జాజు.
ఇప్పుడు ఈ కథనం ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటి ? ఎప్పుడూ అధైర్యపడక మన కష్టం మీద నమ్మకం పెట్టుకోవాలి.అప్పుడే గనుక ప్రియాంక ఆత్మహత్య చేసుకోని ఉండుంటే .ఇప్పుడున్న స్టార్డమ్ ని ఎంజాయ్ చేసేదా!
.






