ప్రియాంక చోప్రా ఇంస్టాగ్రామ్ ఒక్క పోస్ట్ తో అన్ని కోట్లు సంపాదిస్తోందా... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మోడల్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం హీరోయిన్గా అవకాశాలు అందుకున్నటువంటి వారిలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) ఒకరు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రియాంక చోప్రా అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఈమెకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక ఈమె అమెరికన్ పాపులర్ సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఇలా పెళ్లి చేసుకున్నటువంటి ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లోనే స్థిరపడిపోయారు.

ఇలా అమెరికాలోనే ఉంటున్నటువంటి ఈమె హాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటు అక్కడే బిజీ అయ్యారు.దీంతో బాలీవుడ్ సినిమాలను కూడా కాస్త దూరం పెట్టారని తెలుస్తుంది.ఇలా హాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తన భర్తతో అలాగే కూతురితో కలిసి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే ఈమెకు ఇంస్టాగ్రామ్( Priyanka Chopra Instagram ) లో ఏకంగా 8.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

Advertisement

ఈ స్థాయిలో ఫాలోవర్స్ సంపాదించుకున్నటువంటి తారాలలో ప్రియాంక చోప్రా మంచి గుర్తింపు పొందారు.ఇలా ఇంతమంది ఫాలోవర్స్ కలిగి ఉన్నటువంటి ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఆమె పోస్టులు చేస్తూ ఉంటారు.ఇలా ఒక బ్రాండ్ కు సంబంధించి ఒక పోస్ట్ ను కనుక ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రమోట్ చేశారు అంటే భారీ స్థాయిలోనే డబ్బు తీసుకుంటున్నారని తెలుస్తుంది.

ఇలా ఒక్క పోస్టుకు ప్రియాంక చోప్రా దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ( Priyanka Chopra Remuneration ) అందుకుంటున్నట్టు సమాచారం.ఒక్క పోస్టుకు మూడు కోట్లు అంటే మామూలు విషయం కాదు.

ఇక్కడ హీరోయిన్స్ ఒక సినిమాల్లో నటిస్తే వారికి మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.అలాంటిది ఈమె సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ రేంజ్ లో సంపాదిస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు