Priyanka Chopra Nick: మరోసారి రెచ్చిపోయిన ప్రియాంక-నిక్.. వేదికపై రొమాన్స్?

బాలీవుడ్ క్యూట్ కపుల్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ల గురించి మనందరికీ తెలిసిందే.ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) తనకంటే పదేళ్లు చిన్నవాడైనా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను( Nick Jonas ) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

 Priyanka Chopra Nick: మరోసారి రెచ్చిపోయిన -TeluguStop.com

అయినప్పటికీ ఈ జంట ఎంతో చూడముచ్చటగా కనిపిస్తూ ఉంటారు.అంతేకాకుండా తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.

ఈ జంటకు టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలిచే ఈ జంట తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.

కాగా ఈ జంటకు మాల్టీ మేరీ( Malti Marie ) అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం న్యూయార్క్‌లో( New York ) జరుగుతున్న మ్యూజిక్‌ కన్సర్ట్‌లో నిక్ జోనాస్ ప్రదర్శన ఇస్తున్నారు.తన సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లతో కలిసి ఈవెంట్‌లో పాల్గొన్నారు.ఈ ఈవెంట్‌కు ప్రియాంక చోప్రా కూడా హాజరైంది.వేదికపై భర్తను ఉత్సాహంగా ప్రోత్సహిస్తూ సందడి చేసింది.యాంకీ స్టేడియంలో ఒక సంగీత కచేరీలో( Music Concert ) ప్రియాంక ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కనిపించింది.

అయితే అదే సమయంలో వేదిక పక్కనే ఉన్న ప్రియాంక తన భర్త నిక్‌ జోనాస్‌ ముద్దు పెట్టుకోవడం కనిపించింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇటీవలే సంగీత కచేరీకి హాజరైన ప్రియాంక తన భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది.స్టేజ్ పైనే రొమాన్స్ చేస్తూ కనిపించారు.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కాగా గతంలో కూడా చాలాసార్లు వీరిద్దరూ స్టేజ్ పైన ఒకరినొకరు హత్తుకోవడం ముద్దులు పెట్టుకున్న వీడియోలు ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube