తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా( priyanka chopra ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని( Miss World crown ) కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంటూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.బాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
మొన్నటి వరకు బాలీవుడ్ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటూ అక్కడ టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియాంక చోప్రా తనకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక తన మొదటి పారితోషికంతో( priyanka chopra his first remuniration) తనకు నచ్చిన వస్తువులు కొన్నట్లు వెల్లడించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
నా తొలి సంపాదనగా నేను ఎక్కువ అమౌంట్‌నే అందుకున్నాను.దానితో మొదటిసారి కారు కొన్నాను.
ఒక ఖరీదైన ఉంగరం కొన్నాను.నా మొదటి పారితోషికంతో నాకు నచ్చిన పనులు చేశాను.
ఈ విషయంలో ఇప్పటికీ గర్వపడుతుంటాను.
ఇక నా తల్లిదండ్రులు కూడా నన్నెప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు.
వారి కోసం నా సంపాదనను ఖర్చు చేయడంలో నాకు ఆనందం ఉంది అని తెలిపింది ప్రియాంక చోప్రా.ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికొస్తే ఇటీవలే హాలీవుడ్లో సిటా డెల్ అనే ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం హాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.







