నాచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుల్ మోహన్ ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది.ఆ తర్వాత శర్వానంద్ శ్రీకారం సినిమాలో కూడా అమ్మడు నటించింది.
తెలుగులో చేసిన రెండు సినిమాలు పెద్దా ఫలితాన్ని అందించలేదు.అందుకే తన ఫోకస్ మొత్తం తమిళ సినిమాల మీదే పెట్టింది ప్రియాంక.
తమిళంలో ఆమె చేస్తున్న సినిమాలకు మంచి ఫలితాలు వస్తున్నాయి.శివ కార్తికేయన్ తో చేసిన రెండు సినిమాలు ఆమె ఖాతాలో హిట్లుగా నిలిచాయి.
రీసెంట్ గా శివ కార్తికేయన్ డాన్ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.విషయం ఏంటంటే ఈ సినిమా తెలుగులో కూడా బాగానే ఆడింది.
కోలీవుడ్ లో సత్తా చాటుతున్న ఈ అమ్మడి టాలెంట్ ని తెలుగు వాళ్లే గుర్తించట్లేదని అర్ధమవుతుంది.ముఖ్యంగా మన మేకర్స్ ఆమెకు మంచి పాత్రలు ఇవ్వట్లేదని అంటున్నారు.
చేసిన రెండు సినిమాలతోనే తెలుగులో ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది ప్రియాంక.ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆమెని తెలుగులో సినిమాలు చేయాలని కోరుతున్నారు.
ప్రియాంకా కూడా సరైన ఛాన్స్ వస్తే తెలుగులో నటించడానికి ఓకే చెబుతుంది.