మెగా నిర్మాత కె.టి. కుంజుమోన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న 'జెంటిల్‌మేన్ 2' లో మరో కథానాయికగా ప్రియా లాల్

మెగా నిర్మాత కె.టి.

 Priyaa Lal Comes On Board To Play Another Lead Actress In Kt Kunjumon’s Gentle-TeluguStop.com

కుంజుమోన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ‘జెంటిల్‌మేన్ 2’ లో మరో కథానాయికగా ప్రియా లాల్ మెగా నిర్మాత కె.టి.కుంజుమోన్ మరోసారి సరికొత్తగా భారీ చిత్రాలు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.అర్జున్, మధు ప్రధాన పాత్రలలో తన నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా రూపుద్దిద్దుకొని సంచలన విజయం సాధించిన ‘జెంటిల్‌మేన్’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సూపర్ క్రేజీ సీక్వెల్ లో కథానాయికగా నయనతార చక్రవర్తి ను ఎంపిక చేశారు నిర్మాతలు.ఇప్పుడీ సీక్వెల్ లో నటించబోయే మరో నటి పేరుని ప్రకటించారు.

తెలుగులో ‘గువ్వా గోరింక‘ చిత్రంతో అరంగేట్రం చేసిన హీరోయిన్ ప్రియాలాల్ ని మరో కథానాయికగా ఖరారు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.మ్యూజికల్ బాహుబలి ఎంఎం కీరవాణి ఈ మెగా సీక్వెల్ కి సంగీతం అందించనున్నారు.

బ్లాక్ బస్టర్ హిట్ ‘జెంటిల్‌మేన్’ కి సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube