మలయాళంలో ఒరు ఆధార్ లవ్ టీజర్ తో పాన్ ఇండియా రేంజ్ లో ట్రెండ్ సృష్టించిన ప్రియా ప్రకాస్ వారియర్( Priya Prakash Varrier ) ఆ సినిమా తెలుగు రిలీజ్ చేసినా పెద్దగా వర్క్ అవుట్ అవలేదు.అయితే ఆ సినిమా రిలీజ్ టైం లో ఒకటి రెండు తెలుగు ఆఫర్లు రాగా వాటిని లైట్ తీసుకున్న ప్రియా ప్రకాష్ ఆ తర్వాత తను వచ్చి ఛాన్స్ అడిగినా మన వాళ్లు సారీ అనేశారు.
ఇక లేటెస్ట్ గా పవర్ స్టార్ బ్రో( Bro ) సినిమాలో ప్రియా లక్కీ ఛాన్స్ అందుకుంది.ఈ సినిమాతో తెలుగులో ఫస్ట్ హిట్ కొట్టింది ప్రియా ప్రకాశ్.
అయితే అంతకుముందులా తనకు వచ్చిన అవకాశాన్ని ఏదో ఒక కారణం చెప్పి వదులుకోకుండా అమ్మడు తన పద్ధతి మార్చుకున్నట్టు తెలుస్తుంది.ఎలాగు కెరీర్ అంత సూపర్ గా లేదు కాబట్టి టాలీవుడ్ లో( Tollywood ) ఎలాంటి ఆఫర్ వచ్చినా సరే చేయాలని ఫిక్స్ అయ్యింది అమ్మడు.ఈమధ్య యూత్ ఫుల్ సినిమాలు తెలుగు ఆడియన్స్ ని బాగా అలరిస్తున్నాయి.అందుకే ప్రియా ప్రకాష్ అలాంటి కథ ఉంటే తాను ఏం చేయడానికైనా రెడీ అని చెబుతుందట.
మొత్తానికి ప్రియా ప్రకాష్ ఇప్పటికి లైన్ లోకి వచ్చిందని అనుకుంటున్నారు ఆడియన్స్.