మూడో తరగతిలోనే ప్రేమలో పడ్డ ప్రియా ప్రకాష్ వారియర్

వింక్ బ్యూటీగా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న అందాల భామ ప్రియా ప్రకాష్ వారియార్. పూర్తిస్థాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే కన్నుకొట్టి కుర్రాళ్ళ మనసు దోచేసిన ఈ మల్లు పిల్ల తరువాత యాడ్స్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యింది.

 Priya Prakash First Crush At The Age In Third Class, Tollywood, South Cinema, Ch-TeluguStop.com

ప్రస్తుతం ఈ అమ్మడు నితిన్ హీరోగా తెరకెక్కిన చెక్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఆ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.

ఒరు ఆదార్ లవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అందులో ఆమెది పూర్తి స్థాయి పాత్ర కాదు.అలాగే శ్రీదేవి బంగ్లా అనే సినిమా హిందీలో చేసిన అది రిలీజ్ కి నోచుకోలేదు.

ఈ నేపధ్యంలో ప్రియా ప్రకాష్ చెక్ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది.ఈ సినిమా సక్సెస్ తన ఇమేజ్ ని పూర్తిగా మార్చేస్తుందనే నమ్మకంతో ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ గా తన జర్నీ, క్రష్ గురించి ఈ అమ్మడు ఆసక్తికర విషయాలని మీడియాతో పంచుకుంది.మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటంతో అతని సినిమాలు రెగ్యులర్ గా చూస్తూ ఉంటా.

అలా అతని డాన్స్ కి, స్టైల్ కి అభిమానిగా మారిపోయాను.అతనితో సినిమా చేసే అవకాశం వస్తే ఏ మాత్రం ఆలోచించకుండా ఒకే చెప్పేస్తా అని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

అలాగే తన ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ అంటే మాత్రం హృతిక్ రోషన్ అని చెప్పింది.అలాగే తాను మూడో తరగతిలో ఉన్నప్పుడే ప్రేమలో పడ్డాడని, అలాగే లైఫ్ లో ఫస్ట్ క్రష్ ఆ సమయంలోనే ఏర్పడిందని ప్రియా ప్రకాష్ చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే చెక్ సినిమా రిలీజ్ అవుతూ ఉండగా మరో రెండు తెలుగు సినిమాలు ఆమె కమిట్ అయ్యి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube