మణిపూర్ హింసపై పార్లమెంట్ లో ప్రకటన చేయడం ప్రధానమంత్రి మోదీ కర్తవ్యమని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు.పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ వెలుపల ప్రధాని మోదీ ప్రకటన చేయడం సిగ్గుచేటన్నారు.
మణిపూర్ లో పరిస్థితి ఎలా ఉందో ప్రధాని ప్రకటన చేయాలని లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ను అభ్యర్థిస్తున్నామని తెలిపారు.రూల్ 267 ప్రకారం సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.