ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.దేశ ప్రజలకు ప్రధాని శుభవార్త చెప్పారు.
దేశ ప్రజలందరికి ఫ్రీగా వ్యాక్సినేషన్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.జూన్ 21 నుండి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు.
కేంద్రం పరిధిలోనే వ్యాక్సిన్ ప్రక్రియ ఉంటుందని చెప్పారు నరేంద్ర మోడీ.కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని.
అందుకే యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు.ఈ శతాబ్ధంలోనే ఇది అత్యంత ఘోరమైన విషాదమని.
దేశ చరిత్రలో ఇంత మెడికల్ ఆక్సీజన్ ఎప్పుడూ అవసరం రాలేదని అన్నారు.

దేశ ప్రజలు కరోనా వల్ల ఎంతో బాధపడుతున్నారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచంలో వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలు చాలా తక్కువ అని.మనం వ్యాక్సిన్ తయారు చేసుకోకపోతే ఇతర దేశాల నుండి రావడానికి ఏళ్లు పట్టేదని అన్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అన్నిటిని ఉపయోగించి ఆక్సీజన్ కొరత తీర్చుతున్నామని అన్నారు.ఆధునిక కాలంలో ఇలాంటి విపత్తు ఎప్పుడూ రాలేదని గత వందేళ్లలో ఇదే అతి పెద్ద మహమ్మారి అని అన్నారు మోడీ.దేశంలో మెడికల్ ఆక్సీజన్ ఉత్పత్తిని 10 కోట్లకు మించి పెంచామని అన్నారు ప్రధాని మోడీ.25 శాతం వ్యాక్సిన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కు పంపిణీ చేస్తాయని అన్నారు.వ్యాక్సిన్ ధర 150 రూ.లు మాత్రమే తీసుకునేలా చేస్తామని చెప్పారు.దీపవళి వరకు పేదలందరికి ఉచితంగా రేషన్ అందిస్తామని మోడీ ప్రకటించారు.