హైదరాబాద్ లో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.ఉదయం 11.30 గంటలకు ఆయన హైదరాబాద్ కు రానున్నారు.పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో వందే భారత్ రైలును మోదీ ప్రారంభించనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో పాల్గొననున్నారు.సభా ప్రాంగణంలో దాదాపు గంటన్నర సేపు ఉండనున్నారు.
తరువాత పరేడ్ గ్రౌండ్ నుంచి రైల్వే ప్రాజెక్టులతో పాటు బీబీ నగర్ ఎయిమ్స్ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.అయితే ఇప్పటికే ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.







