ప్రధాని నరేంద్ర మోదీకి ( Prime Minister Narendra Modi ) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దేశవ్యాప్తంగా మోదీని ఎంతో అభిమానిస్తారు.
దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మోదీకి వీరాభిమానులు ఉన్నారు.వరల్డ్ వైడ్ గా మోదీ పేరు అంటే తెలియనివారు ఎవరూ ఉండరు.
మోదీ అంత క్రేజ్ ను సంపాదించుకున్నారు.అయితే మోదీకి అనేకమంది అభిమానులు సర్‌ప్రైజ్‌లు ఇస్తూ ఉంటారు.
తాజాగా ఒక అభిమాని మోదీకి బిగ్ సర్‌ప్రైజ్ ( Big surprise )ఇచ్చాడు.అత్యంత ఖరీదైన గిఫ్ట్ అందించాడు.

ఏకంగా 7200 వజ్రాలతో ప్రధాని ఫొటో తయారుచేశాడు.మోదీకి ఈ అరుదైన గిఫ్ట్ ను అభిమాని ఇవ్వబోతున్నాడు.సెప్టెంబర్ 17న మోదీ తన పుట్టినరోజుని జరుపుకోనున్నారు.ఇది మోదీ 73వ పుట్టినరోజు. దీంతో బర్త్ డే సందర్బంగా మోదీకి ఒక అభిమాని అరుదైన గిఫ్ట్ ఇవ్వనున్నాడు.సూరత్‌కి( Surat ) చెందిన విపుల్ జేపీవాలా( Vipul JPwala ) అనే వ్యక్తి మోదీకి వీరాభిమాని.
దీంతో 7200 వజ్రాలతో మోదీ ఫొటోను తయారుచేశాడు.ఈ ఫొటోను మోదీకి బహుమతిగా ఇవ్వనున్నాడు.
ఇప్పటికే ఆయన మోదీకి సంబంధించిన 9కిపైగా ఫొటోలు తీశాడు.

విపుల్ ఆర్కిటెక్ట్ ఇంజీనీర్‌గా( Viple Architect as Engr ) పనిచేస్తుండగా.ఇప్పటివరకు చాలామంది ఇళ్లల్లో ఇంటీరియల్ డిజైనర్ గా పనిచేశాడు.అలాగే కొద్దికాలంగా వజ్రాలతో పెయింటింగ్ లు వేయడం ప్రారంభించాడు.
అందులో భాగంగా దాదాపు మూడున్నర నెలలు కష్టపడి మోదీ చిత్రపటాన్ని తయారుచేశాడు.మూడు వేర్వేరు రంగుల వజ్రాలను ఈ ఫొటో తయారుచేయడానికి ఉఫయోగించాడు.
ప్రధాని మోదీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు జొబైడెన్ భార్యకు వజ్రాలు పొదిగిన క్రాఫ్ట్ ను బహుమతిగా ఇచ్చాడు.దానిని చూసి తర్వాత ప్రధాని మోదీ ఫొటోలను రూపొందించాలనే ఆలోచన వచ్చినట్లు ఈ అభిమాని చెబుతున్నాడు.
ఈ వజ్రాలను అతికించడానికి ప్రత్యేకమైన జిగురును ఉపయోగించాడు.ఎక్కువకాలం అతుక్కుపోయేలా చేయడానికి ప్రత్యేకమైన వజ్రాలను తీసుకున్నాడు.







