టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ఈరోజు కారు ప్రమాదానికి గురి కావడం తెలిసిందే.ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్ వెళ్తున్న సమయంలో రూర్కీ దగ్గర రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ నీ ఢీకొట్టడం జరిగింది.
దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.వెంటనే కారులో నుండి పంత్ దూకేసి తన ప్రాణాలను కాపాడుకున్నాడు.
ఈ క్రమంలో స్థానికులు గుర్తించి రిషబ్ నీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
తెల్లవారుజామున ఐదున్నర గంటలకు జరిగిన ఈ ఘటన క్రీడాలోకాన్ని కుదిపేసింది.
అయితే ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు.ఈరోజు ఆయన తల్లి మరణం తాలూకు విషాదంలో ఉన్నప్పటికీ రిషబ్ పంత్ యాక్సిడెంట్ లో గాయపడిన వార్త తనని కలిసి వేసినట్లు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదానికి గురికావడం తనకు ఎంతో విచారాన్ని కలిగించిందని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.రిషబ్ వెంటనే స్పందించి క్షేమంగా ఆయురారోగ్యాలతో కోలుకుని త్వరగా రావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.







