రాష్ర్టపతి కూతురి ఆగ్రహం

రాష్ర్టపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తె, ప్రసిద్ధ నృత్య కళాకారిణి శర్మిష్ఠ ముఖర్జీకి కోపం వచ్చింది.ఎవరి మీద? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మీద.

ఎందుకు? ఆయన ఈ మధ్య ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ర్ట హోదా కల్పించాలి అని డిమాండ్‌ చేశారు.కేంద్ర ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన కేజ్రీవాల్‌ ఈ డిమాండ్‌ చేశారు.

ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ సర్కారు కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న సంగతి తెలుసు.అయితే కేజ్రీవాల్‌ డిమాండ్‌ను శర్మిష్ఠ ముఖర్జీ పొలిటికల్‌ గిమ్మిక్గా తేల్చిపారేశారు.

ఆమె ఢిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెసు కమిటీ నాయకురాలు కావడంతో ఈ విమర్శలు చేశారు.ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ర్ట హోదా కోసం రిఫరెండం నిర్వహించాలన్న కేజ్రీవాల్‌ డిమాండ్‌ రాజకీయ గిమ్మిక్కు మాత్రమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమని కూడా రాష్ర్టపతి కుమార్తె అన్నారు.

ఇంతటితో ఆగకుండా ఇంకొద్దిగా ముందుకెళ్లి ఇది జాతి వ్యతిరేక చర్య అని కూడా దుయ్యబట్టారు.కేంద్రంతో కేజ్రీవాల్‌కు ఘర్షణ రావడం, సమస్యల పరిష్కారంలో విఫలం కావడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ర్ట డిమాండ్‌ను ముందుకు తెచ్చారని శర్మిష్ఠ అన్నారు.

Advertisement

తండ్రి రాష్ర్టపతి కాబట్టి ఆయన మనసులో ఎలాంటి భావాలు, ఆలోచనలు ఉన్నా మాట్లాడకూడదు.ప్రకటనలపై స్పందించకూడదు.కూతురు క్రియాశీలక నాయకురాలు కాబట్టి ఏం మాట్లాడినా అభ్యంతరం ఉండదు.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు