మరికొద్దిరోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) శనివారం రాజకీయాలు, క్రీడలు, వినోదం, పౌర హక్కులు, ఎల్‌జీబీటీక్యూ న్యాయవాదులు, విజ్ఞాన శాస్త్రంలో సేవలందించిన పలువురు ప్రముఖులకు ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ను( Presidential Medal of Freedom ) ప్రదానం చేశారు.
వైట్‌హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డెమొక్రాటిక్ పార్టీ సీనియర్ నేత, మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు( Hillary Clinton ) ఈ పతకాన్ని ప్రదానం చేశారు బైడెన్.
ఈ కార్యక్రమానికి హిల్లరీ క్లింటన్ భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, కుమార్తె చెల్లియా క్లింటన్, మనవరాళ్లు హాజరయ్యారు.
అలాగే డెమొక్రాటిక్ పార్టీకి చెందినే జార్జ్ సోరస్, నటుడు - దర్శకుడు డెంజెల్ వాషింగ్టన్, చెఫ్ జోస్ ఆండ్రేస్ , బోనో, జాన్ గూడాల్, అన్నా వింటౌర్, రాల్ఫ్ లారెన్, జార్జ్ స్టీవెన్స్ జూనియర్, టిమ్ గిల్, డేవిడ్ రూబెన్ స్టెయిన్‌లకు కూడా అమెరికా అత్యున్నత పౌర పురస్కారం లభించింది.ఇక మరణానంతరం నలుగురు ప్రముఖులకు ఈ అవార్డ్ ప్రకటించారు బైడెన్.మిచిగన్ గవర్నర్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీగా పనిచేసిన జార్జ్ డబ్ల్యూ రోమ్నీ.
మాజీ అటార్రనీ జనరల్ , సెనేటర్‌గా సేవలందించిన రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ,( Robert F Kennedy ) మాజీ రక్షణ కార్యదర్శి యాష్ కార్టర్.మిస్సిస్సిప్పి ఫ్రీడమ్ డెమొక్రాటిక్ పార్టీ వ్యవస్ధాపకులు , 1965 ఓటింగ్ హక్కుల చట్టానికి పునాదులు వేసిన ఫెన్నీ లౌ హామర్‌లకు ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు బైడెన్.
అధ్యక్షుడిగా మరో 15 రోజుల్లో జో బైడెన్ దిగిపోనున్నారు.ఈ నేపథ్యంలో సైనికులు, మాజీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అవార్డులు, పతకాలు జారీ చేస్తూ కాలం గడిపేస్తున్నారు.కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్( Congressional Research Service ) ప్రకారం.
ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడంను 1963 నుంచి 2024 మధ్య 654 మందికి ప్రదానం చేశారు.ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న వారిలో డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మాయా ఏంజెలో, మదర్ థెరిస్సా వంటి మహనీయులు ఉన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy