సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Droupadi Murmu ).హైదరాబాద్ చేరుకున్నారు.
శీతాకాల విడిది కోసం డిసెంబర్ 18 నుండి 23 వరకు హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు.సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతిని.
రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై( Tamilisai ), సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలకడం జరిగింది.ఇదే సమయంలో పలువురు మంత్రులు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తతో పాటు పలువురు స్వాగతం పలికారు.
ఈ క్రమంలో విమానాశ్రయం నుంచి బొల్లారంలో రాష్ట్రపతి నిలయానికి చేరుకోవడం జరిగింది.అక్కడే బస చేయనున్నారు.
ఐదు రోజుల విడిది అనంతరం.డిసెంబర్ 23న తిరుగు ప్రయాణం కానున్నారు.
ఐదు రోజులలో రాష్ట్రపతి ముర్ము… పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు.రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో.
హైదరాబాద్( Hyderabad ) లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది.రాష్ట్రపతి పర్యటించే రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై.
ముందుగానే పోలీసు మరియు ఇంటిలిజెంన్స్ సిబ్బంది నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.ఈ క్రమంలో రక్షణ శాఖ పరిధిలో ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి.
బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న.రాష్ట్రపతి ముర్ము.
అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా.రాష్ట్రపతి నిలయానికి చేరుకోవడం జరిగింది.