అల్లు అరవింద్ సమర్పణలో బ‌న్నీ వాసు నిర్మాత‌గా జీఏ 2 పిక్చ‌ర్స్, కిరణ్ అబ్బవరం కాంబినేషన్ లో 'వినరో భాగ్యము విష్ణుకథ' షూటింగ్ తిరుపతిలో ప్రారంభం..

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా యంగ్ హ్యాపెనింగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, యంగ్ హీరోయిన్ క‌శ్మీర ప‌ర్ధేశీ జంట‌గా నటిస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ.ఈ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురూ ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు.

 Presented By Allu Arvind And Produced By Bunny Vasu, Ga2 Pictures, Kiran Abbava-TeluguStop.com

ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కులు ప్ర‌శాంత్ నీల్, కిషోర్ తిరుమ‌ల ద‌గ్గ‌ర మురిళి కిషోర్ గ‌తంలో పనిచేశారు.తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరుపతిలో మొదలైంది 35 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో 80 శాతం షూటింగ్ పూర్తి చేయనున్నారు.

ఇందులోనే పాటలు, ఫైట్ సీక్వెన్స్ లు కూడా ఉండబోతున్నాయి.

పిల్లా నువ్వు లేని జీవితం,‌ భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, చావు క‌బురు చ‌ల్ల‌గా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి అద్భుతమైన విజయాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ఇది.ఓ వినూత్న‌మైన క‌థ‌తో ఈ నూత‌న చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లుగా నిర్మాత బ‌న్నీవాసు తెలిపారు.విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ అనే టైటిల్ కు కూడా అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు చైత‌న్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు.

త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube