నితిన్ హీరోగా ఎం ఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకుడి గా శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న మాచర్ల నియోజకవర్గం భారీ షెడ్యూల్‌ పూర్తి

ప్రస్తుతం హీరో నితిన్ రాబోయే చిత్రం మాచర్ల నియోజకవర్గం షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు.ప్రముఖ ఎడిటర్ MS రాజ శేఖర్ రెడ్డి దర్శకుడి గా పరిచయం అవుతున్నారు.

 Nithiin, Ms Raja Shekhar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Completes-TeluguStop.com

ఈ సినిమాను ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ భారీ షెడ్యూల్‌ ను పూర్తి చేసుకుంది.

అనల్ అరసు మాస్టర్ పర్యవేక్షణలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను రూపొందించారు, ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన మాస్ డ్యాన్స్ పూర్తయింది.ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వివరాలు త్వరలో రాబోతున్నాయి.

నితిన్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ, అనల్ అరసు మాస్టర్ కంపోజ్ చేసిన అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది.జానీ మాస్టర్ సాంగ్ కంప్లీట్ అయింది.

ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వివరాలు త్వరలో రాబోతున్నాయి.అన్నారు.

ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు.నితిన్‌ తో ఇద్దరు కథానాయికల కలయిక ఇదే తొలిసారి.

పొలిటికల్ ఎలిమెంట్స్‌ తో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నాడు.ఈ చిత్రంలో భారీ తారాగణం కూడా ఉంది.

అనుభవం గల సాంకేతిక సిబ్బంది పని చేస్తున్నారు.భీష్మ, మాస్ట్రో తర్వాత మహతి స్వర సాగర్ మూడవసారి నితిన్‌ తో కలిసి పనిచేస్తున్నారు.

ప్రసాద్ మూరెళ్ల కెమెరా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్.కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌.

నటీనటులు: నితిన్, కేథరిన్ థెరిస్సా, కృతి శెట్టి తదితరులు

.

Nithiin - నితిన్ హీరోగా ఎం ఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకుడి గా శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న మాచర్ల న

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube