తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా 7వ అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాలు

ఈస్ట్ బృన్స్విక్: న్యూ జెర్సీ: సెప్టెంబర్ 20: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సన్నద్ధమవుతోంది.వచ్చే ఏడాది మే 26, 27 మరియు 28 తేదీ లలో న్యూ జెర్సీ లో నిర్వహించనున్న ఈ సంబరాల కోసం నాట్స్ సన్నాహాక సమావేశం నిర్వహించింది.న్యూజెర్సీలో నిర్వహించిన ఈ సమావేశానికి నాట్స్ జాతీయ నాయకత్వం పాల్గొన్ని సంబరాలకు చేయాల్సిన కసరత్తు పై చర్చించింది.2023 లో జరగనున్న 7 వ అమెరికా తెలుగు సంబరాల కన్వీనర్ శ్రీధర్ అప్పసాని ఈ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తొమ్మిది కమిటీలను ప్రకటించారు.ప్రోగ్రామ్స్, హాస్పిటాలిటీ, ఆపరేషన్స్, రిజిస్ట్రేషన్, పబ్లిసిటీ అండ్ మార్కెటింగ్, రెవిన్యూ జనరేషన్, కమ్యూనిటీ సర్వీసెస్, స్పోర్ట్స్ అండ్ కాంపిటీషన్స్, యూత్ కమిటీలు ఇందులో ఉన్నాయి.సంబరాల నిర్వహణ కోసం సంబరాల కమిటీ కో కన్వీనర్లుగా వసుంధర దేసు, రాజేంద్ర అప్పలనేని, పబ్లిసిటీ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా మురళీ కృష్ణ మేడిచెర్లకు బాధ్యతలు అప్పగించారు.

 Preparations For The 7th America Telugu Celebrations To Reflect The Telugu Cultu-TeluguStop.com

అమెరికా తెలుగు సంబరాల్లో ఈసారి ప్రత్యేక కార్యక్రమంగా అమెరికా తెలుగుఅమ్మాయి అనే పోటీలు నిర్వహించాలని నాట్స్ నాయకత్వం నిర్ణయించింది.

అమెరికాలోని అన్ని రాష్ట్రాల నాట్స్ విభాగాలు ఇందులో భాగస్వాములయ్యేలా ప్రణాళికలను తయారుచేస్తోంది.

దీంతో పాటు సంబరాల రిజిస్ట్రేషన్లు, సంబరాల్లో ఈ సారి సరికొత్తగా నిర్వహించే కార్యక్రమాల పై సభ్యుల సలహాలు, పలు సూచనలను నాట్స్ నాయకత్వం స్వీకరించింది.ఈ కార్యక్రమానికి నాట్స్ ముఖ్య నాయకులు మధు కొర్రపాటి, సామ్ మద్దాలి, శ్రీధర్ అప్పసాని, బోర్డు సెక్రెటరీ శ్యామ్ నాళం తో పాటు బోర్డ్ డైరెక్టర్స్ రాజ్ అల్లాడ, చంద్రశేఖర్ కొణిదెల, శ్రీహరి మందాడి, వంశీ కృష్ణ వెనిగళ్ల, వైస్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్స్ హరినాథ్ బుంగటావుల, నాట్స్ సెక్రెటరీ రంజిత్ చాగంటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ(మీడియా) మురళీ కృష్ణ మేడిచెర్ల, జోనల్ వైస్ ప్రెసిడెంట్ (నార్త్ ఈస్ట్) గురుకిరణ్ దేసు, ఇమ్మిగ్రేషన్ అసిస్టెన్స్ సూర్య గుత్తికొండ, నాట్స్ న్యూజెర్సీ కో ఆర్డినేటర్ మోహనకృష్ణ వెనిగళ్ల, భీమినేని శ్రీనివాసరావు, గిరి కంభంమెట్టు, కిరణ్ తవ్వ, శ్రీకాంత్ నల్లూరి, సందీప్ నూకవరపు, ఎన్.గోవింద్, వెంకట్ పాలడుగు, సురేష్ బొందుగుల, మధు బుదాటి, రమణ రాకోతు మరియు స్థానిక నాయకులు బిందు ఎలమంచిలి, లక్ష్మీ మోపర్తి, శేఖర్ కొనల, సురేష్ పద్మనాభిని, టి.పి.రావు, విజయ్ బండ్ల, ఓం, సాయి, మహేశ్ సలాది, అశోక్ చింతకుంట‌, దాము గేదెల తదితరులు తమ విలువైన సూచనలు అందించారు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, ఆత్మీయతను పంచేలా ఈ సంబరాలు ఉండాలని నాట్స్ నాయకులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు.

ఆ దిశగా కార్యక్రమాల ప్రణాళికలు తయారుచేయాలని నిశ్చయించుకున్నారు.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని సంబరాలపై తన ఆలోచనలను ఈ సమావేశంలో వివరించారు.

తెలుగు సంస్కృతి, వారసత్వం, సంప్రదాయ కార్యక్రమాలపై వసుంధర దేసు తన అభిప్రాయాలను పంచుకున్నారు.సంబరాల్లో తెలుగుదనం ప్రతిబింబించేలా చేపట్టాల్సిన కార్యక్రమాలపై మురళీ మేడిచెర్ల తన ఆలోచనలను కమిటీ ముందు ఉంచారు.

సంబరాల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రధానంగా ఈ సన్నాహక సమావేశంలో చర్చించారు.

నాట్స్ ఛైర్ విమెన్ అరుణగంటి, నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

నాట్స్ సభ్యులు, నాయకులు సంబరాల విజయానికి ఇప్పటి నుంచి చేస్తున్న కృషిని వారు ప్రత్యేకంగా అభినందించారు.అమెరికా తెలుగు సంబరాలకు తమ మద్దతు, సహకారం సంపూర్ణంగా ఉంటుందని ఈ సమావేశానికి విచ్చేసిన సాయి దత్త పీఠం శివ విష్ణు మందిరం వ్యవస్థాపకుడు రఘు శర్మ శంకరమంచి అన్నారు.

నాట్స్ సంస్థ తో తమకున్న అనుబంధాన్ని, కలసి చేసిన, చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలని గుర్తు చేసుకున్నారు.తనతో పాటు, వాలంటీర్లు వెంకట్ సింగనమల, శ్రీహరి దండు, సంస్కృత సోదరులుగా పిలువబడే కొడవటిగంటి మహాదేవ శర్మ, కొడవటిగంటి శ్రీకాంత్ శర్మ కూడా ఈ సమావేశానికి విచ్చేసి సాహిత్య పరంగా తెలుగు సంబరాల కోసం తమవంతు సహాయం అందిస్తామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube