ప్రెగ్నెంట్ అని తెలిసిన గంటలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ...!

ఓ మహిళ లాక్ డౌన్ సమయంలో మితిమీరి తినడంతో దానితో లావు అయ్యానని భావించింది.

అయితే తాజాగా సదరు మహిళ ఉదయం పూట మూడు గంటల సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో రెండు గంటల తర్వాత తన భర్తతో కలిసి హాస్పిటల్ కు చేరుకుంది.

అయితే అక్కడ తెలియని విషయం ఏమిటంటే.తన కడుపు నొప్పికి గల కారణం ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం.

ఆ విషయం ఆవిడకు అంత వరకు తెలియలేదు కూడా.ఇక అల కడుపునొప్పితో హాస్పిటల్ కు వెళ్లిన సదరు మహిళను డాక్టర్లు పరీక్షించగా వారికి అవి పురిటినొప్పుల అని కన్ఫర్మ్ అయ్యాయి.

ఆ సంగతి విన్న భార్యాభర్తలిద్దరూ నిజానికి ఒకింత షాక్ కు గురయ్యారు.అంతవరకు ఆ మహిళకు నొప్పులు రావడం కానీ, ఎలాంటి ప్రెగ్నెన్సీ సంబంధించిన లక్షణాలు కనిపించలేదని తెలియజేసింది.

Advertisement

ముందుగా హాస్పిటల్ కి వచ్చిన సమయంలో ఆమె ని డాక్టర్లు మీరు గర్భవతా అని అడగగా.వారు కాదని తెలియజేశారు.

అయితే ఆ తర్వాత పరీక్షల నిమిత్తం ఆమెకు పరీక్షలు నిర్వహించారు వైద్యులు.అందులో సదరు మహిళ గర్భవతి అని పాజిటివ్ రిజల్ట్ వచ్చింది.

అలా రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే ఆవిడకు డెలివరీ సూట్ కూడా తలగించి ఆపరేషన్ చేసి పండంటి బిడ్డను చేతిలో పెట్టారు.ఇదంతా వారికి నిజంగా అప్పటికి కూడా నమ్మశక్యంగా లేదు.

లాక్ డౌన్ సమయంలో బయట తిరగడం ద్వారా ఎలాంటి డైట్ ఫాలో అవకుండా ఇష్టం వచ్చిన దాన్ని తినడం ద్వారా లావు అయ్యావు అని భావించిన సదరు మహిళకు అనుకోకుండా పండంటి బిడ్డ చేతిలోకి రావడంతో ఆవిడకు ఏమి మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు.

బిగ్ బాస్ కి వెళ్తే కెరియర్ పిప్పి కావాల్సిందే.. దండం పెట్టేసిన యూట్యూబర్!
Advertisement

తాజా వార్తలు