మల్లె పూలకు( Jasmine ) ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది.ఇక మల్లెపూలు లేకుండా శుభకార్యాలు జరగవు.
కాబట్టి మల్లె తోటలు వేసుకున్న రైతులకు నష్టం అనేది వచ్చే అవకాశం చాలా తక్కువ.ముఖ్యంగా మల్లెలో కొమ్మ కత్తిరింపులు చేస్తే.
దిగుబడిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.సాగు అనేది మామూలుగా కాకుండా కొన్ని మెళుకువలు పాటించి చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు.
మల్లె నాటిన మూడవ సంవత్సరం నుండి దాదాపుగా 15 సంవత్సరాల పాటు దిగుబడి ఇస్తుంది.
జనవరి నెలలో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే పూలలో నాణ్యత బాగుంటుంది.
మల్లెలో కొమ్మ కత్తిరింపులు( Jasmine Branch ) ఎంతో కీలకం.కొమ్మలను కత్తిరిస్తే ఎక్కువ కొమ్మలు రావడం, అన్ని కొమ్మలకు పూలు పుయ్యడం వల్ల దిగుబడి పెరుగుతుంది.
జనవరి నెలలో మొక్కల ఆకులు రాలిపోవడం జరుగుతుంది.అప్పుడు కొమ్మలను తాడుతో కడితే ఆకులన్నీ త్వరగా రాలిపోతాయి.
ఆకులు రాలిన తర్వాత ఐదు సంవత్సరాల లోపు వయసున్న తోటల్లో మూడు అడుగుల పైనుంచి ఉండే మొక్క భాగాన్ని కత్తిరింపులు జరపాలి.

ఎండిన, బలహీనంగా ఉన్న కొమ్మలను తొలగించాలి.తర్వాత ఒక తేలికపాటి నీటి తడిని అందించాలి.కత్తిరింపులు జరిపిన ఒక వారం తర్వాత ఒక్కో చెట్టుకు పది కిలోల పశువుల ఎరువు, 500 గ్రాముల వేపపిండి, 200 గ్రాముల అమోనియం సల్ఫేట్, 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 75 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను వేయాలి.
పూలు పూయడానికి ముందే పొలంలో చీడపీడలను, తెగుళ్లను( Pests ) గుర్తించి రసాయన పిచికారి మందులు ఉపయోగించి వాటిని నివారించాలి.

పూలు పూసిన తర్వాత రసాయన ఎరువుల వాడకానికి అధిక ప్రాధాన్యం ఇవ్వకూడదు.పూలను ఉదయం 10 గంటల లోపు కోసి మార్కెట్ కు తీసుకువెళ్తే తాజాగా ఉండటం వల్ల మంచి ధర పలుకుతుంది.పూల సువాసన మూడు రోజులపాటు ఉండాలంటే ఒక లీటరు నీటిలో 10 గ్రాముల సుక్రోస్ ను( Sucrose ) కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాల పాటు ఉంచి ఆరబెట్టి ప్యాకింగ్ చేయాలి.
అప్పుడు పూలు తమ సువాసనను కోల్పోకుండా ఎక్కువ రోజులు ఉండగలవు.
