Pomegranate Crop :దానిమ్మ పంట సాగులో కొమ్మ కత్తిరింపులలో పాటించవలసిన జాగ్రత్తలు..!

ప్రధాన వాణిజ్య పంటలలో దానిమ్మ పంట( Pomegranate farming ) కూడా ఒకటి.దానిమ్మ పండ్ల చర్మం, రసం, ఆకులు, వేర్లు ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు.

 Precautions To Be Followed In Pruning Of Pomegranate Crop-TeluguStop.com

పొడి వాతావరణం ఉండే ప్రాంతాలలో దానిమ్మ పంటలో అధిక దిగుబడులు సాధించవచ్చు.దానిమ్మ పంట సాగుకు దాదాపుగా అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి.

సున్నపు శాతం, క్షారత కాస్త అధికంగా ఉన్న, లోతైన నేలలలో కూడా దానిమ్మ పంటను సాగు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చుదానిమ్మ పంట సాగులో గణేష్ భగువ, మృదుల, కాంధారి, జ్యోతి, పి-26 రకాలను సాగు చేస్తే మంచి దిగుబడులు పొందవచ్చు.ఉదజని సూచిక 7.0 నుండి 8.5 వరకు ఉండే నేలలు దానిమ్మ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి.

Telugu Agriculture, Crop, Farmers, Yield, Pomegranate-Latest News - Telugu

దానిమ్మ పంట సాగులో అత్యంత కీలకం కొమ్మ కత్తిరింపులు.దానిమ్మ మొక్కలు బలంగా పెరిగిన నాలుగు కొమ్మలను కాండాలుగా ఉంచి మిగిలిన కొమ్మలను కత్తిరించాలి.రెండు నుంచి మూడు సంవత్సరాల లోపు ప్రధమ, ద్వితీయ, తృతీయ కొమ్మలను తగురీతిగా పెంచి సరైన ఆకారంలోకి తీసుకురావాలి.నేలను తాకే కొమ్మలను, గుబురుగా పెరిగే కొమ్మలను, నీటి కొమ్మలను కత్తిరించాలి.

దానిమ్మ చెట్లకు విశ్రాంతి ఇచ్చే సమయంలో చివరి కొమ్మలను 10 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు కత్తిరించాలి.కొమ్మ కత్తిరింపులు తర్వాత వచ్చిన చిగుర్లలో రెండు లేదా మూడు చిగుళ్లు ఉంచి మిగిలిన చిగుళ్ళను తీసేయాలి.

ఇలా చేస్తే బలమైన కొమ్మలపై పిందెలు ఏర్పడి కాయ సైజు కూడా బాగా పెరుగుతుంది.

Telugu Agriculture, Crop, Farmers, Yield, Pomegranate-Latest News - Telugu

దానిమ్మ చెట్టుపై 60 నుంచి 80 కాయలు మాత్రమే ఉంచి మిగిలిన వాటిని తీసేయాలి.ఇలా చేస్తే కాయల సైజు, నాణ్యత పెరుగుతుంది.ముఖ్యంగా కొమ్మ కత్తిరింపులకు వాడే కత్తెరలను ఒక శాతం హైపోక్లోరైడ్( Hypochloride ) ద్రావణంతో శుద్ధి చేసిన తర్వాతనే కొమ్మ కత్తిరింపులు జరిపించాలి.

కోమ్మ కత్తిరింపులలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచి నాణ్యమైన అధిక దిగుబడి( High yield ) పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube