జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.ఈ మేరకు రాష్ట్రపతి నోటిఫకేషన్ జారీ చేశారు.
ప్రస్తుత ఏపీ హైకోర్టు కోసం నియమించిన న్యాయమూర్తుల్లో ప్రవీణ్ కుమార్ అత్యంత సీనియర్ అని ఉత్తర్వుల్లో పేర్కొంటూ జనవరి 1 నుంచి ఆయన పదవీ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు.

కేంద్ర న్యాయ శాఖ జాయింట్ సెక్రటరీ రాజేందర్ కశ్యప్ ఉత్తర్వులు ఇచ్చారు.ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రాధాకృష్ణన్ తెలంగాణ సీజేగా కొనసాగనున్నారు.వీరితో పాటు జస్టిస్ ఆర్‌ఎస్ చౌహన్, జస్టిస్ రామ సుబ్రమణియన్‌ను తెలంగాణకు కేటాయిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.







