”రౌద్రం రణం రుధిరం” సినిమాతో పాన్ ఇండియా మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్.ఈయన నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
కొమురం భీమ్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి గ్లోబల్ స్టార్ గా గొప్ప పేరు సంపాదించు కున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కూడా భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు.
ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను ప్రకటించాడు.కొరటాల సినిమా ప్రకటించి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళక పోవడంతో తారక్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
అయితే తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమా మార్చి నుండి రెగ్యురల్ షూట్ కు వెళ్లనుంది అని క్లారిటీ ఇచ్చేసారు.

NTR30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తుండగా.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా 2024, ఏప్రిల్ 4న రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 31వ సినిమాను కూడా ఎవరితో చేయబోతున్నారో ప్రకటించారు.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రకటించాడు.

భారీ యాక్షన్ మాస్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్టు అఫిషియల్ అనౌన్స్ మెంట్ సైతం వచ్చింది.మరి ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్ళలేదు.ఈ లోపులోనే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ లో మరో సినిమా కూడా చేయబోతున్నాడు అని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం వస్తుంది.మరి ఈ సినిమా మైత్రి మూవీస్ తో చేసే సినిమాకు సీక్వెల్ నా లేదంటే ఫ్రెష్ మూవీనా అనేది తెలియాల్సి ఉంది.
మొత్తానికి ఈ ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
