జాతీయస్థాయిలో బీజేపి పార్టీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయడానికి కీలక నాయకులు భారీ ఎత్తున అండర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది.ఈ క్రమంలో బీజేపి పై దూకుడుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
తనదైన శైలిలో చక్రం తిప్పుతూ ఉన్నారు.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి కాంగ్రెస్ లేకపోయినా ఏర్పాటు చేయవచ్చని స్పష్టం చేశారు.
దేశంలో 1984 తర్వాత కాంగ్రెస్ ఒంటరిగా గెలవలేదని.
అదేవిధంగా గత పది సంవత్సరాలలో 90% పరాజయాలు చూసిందని చెప్పుకొచ్చారు.గాంధీయేతర కుటుంబ వ్యక్తి.అధ్యక్షుడు అయితేనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని వ్యాఖ్యానించారు.2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ కనీస పోటీ కూడా కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది అని చెప్పుకొచ్చారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ఫుల్ టైం అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పీకే సూచించారు.దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు.