ప్రశాంత్ నీల్ ఈ తప్పు చేస్తే మాత్రం సినిమాలు డిజాస్టర్ అవుతాయట.. నెటిజన్లు ఏమన్నారంటే?

ఉగ్రమ్, కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలతో దర్శకుడిగా ప్రశాంత్ నీల్ కెరీర్ విషయంలో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్నారు.కథ విషయంలో కేజీఎఫ్ ఛాప్టర్1 స్థాయిలో కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమా లేదు.

 Prashant Neel Feel The Pressure To Deliver More Mass Than Kgf2 , Feel The Press-TeluguStop.com

అయితే ఎలివేషన్ల విషయంలో కేజీఎఫ్1 తో పోల్చి చూస్తే కేజీఎఫ్2 పై చేయి సాధించడం గమనార్హం.అయితే ఎలివేషన్లను నమ్ముకుని కథ విషయంలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రశాంత్ నీల్ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ సినిమాలోని కొన్ని సన్నివేశాలను నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.గత సినిమాలను మించి ఊరమాస్ కథాంశంతో సినిమాలను తెరకెక్కించాలని భావించిన బోయపాటి శ్రీను వినయ విధేయ రామ సినిమాలో కొన్ని సన్నివేశాల విషయంలో ట్రోల్స్ కు గురయ్యారు.

ప్రశాంత్ నీల్ కథ, కథనం హైలెట్ గా నిలిచేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Telugu Boyapati Srinu, Pressure, Kgf Chapter, Kgf, Prashant Neel, Rajamouli, Ugr

ప్రశాంత్ నీల్ ఒకే తరహా బ్యాక్ డ్రాప్ లను ఎంచుకుంటే ఆ ప్రభావం కూడా సినిమా ఫలితంపై పడే ఛాన్స్ ఉందని సినిమాసినిమాకు భిన్నమైన బ్యాక్ డ్రాప్ లను ఎంచుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. రాజమౌళి సైతం ఈ ఫార్ములానే ఫాలో అవుతున్నాడని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.ప్రశాంత్ నీల్ తర్వాత సినిమాలతో ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటారో చూడాలి.

ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ప్రశాంత్ నీల్ కు పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు ఉండటం కెరీర్ విషయంలో ప్లస్ అవుతోంది.ప్రశాంత్ నీల్ కేజీఎఫ్3 కూడా ఉంటుందని చెబుతూ సినిమాపై అంచనాలను మరింత పెంచారు.

ప్రశాంత్ నీల్ తో సినిమాలను నిర్మించాలని ఆశ పడుతున్న నిర్మాతల సంఖ్య కూడా పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube