తెలంగాణ కాంగ్రెస్ గాలి తీసేసిన పీకే ! 

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

 Prashant Kishor Comments On Ts Congress, Brs, Telangana Government, Congress, B-TeluguStop.com

ఇక పూర్తిగా పరిపాలనపైనే దృష్టి సారించారు .తెలంగాణతో పాటు జరిగిన మధ్యప్రదేశ్,  చత్తీస్ ఘడ్, రాజస్థాన్ , మిజోరాం లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెందింది.  ఇక తెలంగాణలో తమకు తిరుగు లేదని,  మూడోసారి హ్యాట్రిక్ విజయం తమదేననే ధీమాతో ఉంటూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకే పరిమితం అయింది.119 స్థానాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో 64 సీట్లను సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారించారు.

Telugu Brs, Congress, Prashant Kishor, Revanth Reddy, Telangana-Politics

ప్రభుత్వం ఏర్పడి కొద్దిరోజులు మాత్రమే అవుతుంది .ఇంకా మంత్రులు తమ బాధ్యతలను స్వీకరించలేదు.ఇది ఇలా ఉంటే ఈ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు.

మిజోరం మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు .తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది అనడం కంటే,  బీఆర్ఎస్ పార్టీ ఓడిందని చెప్పడమే కరెక్ట్ గా ఉంటుందంటూ ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) వ్యాఖ్యానించారు .మధ్యప్రదేశ్ మినహా మిగిలిన చోట్ల ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా పని చేసింది అని,  మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్లలో అధికారంలోకి రావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు .

Telugu Brs, Congress, Prashant Kishor, Revanth Reddy, Telangana-Politics

హిందుత్వం అంశం తీవ్రంగా పని చేసింది అని,  హిందుత్వ విధానాలను వినిపించడంలో బిజెపి సక్సెస్ అయిందని,  దాని కారణంగానే ఈ ఎన్నికల్లో విజయం సాధించిందని ప్రశాంత్ కిషోర్ తేల్చారు.తెలంగాణలో కాంగ్రెస్ సొంత ఇమేజ్ గెలవలేదని ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అసలు ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీది కాదని, బీఆర్ఎస్ ఓటమి అంటూ తనదైన శైలిలో విశ్లేషించారు .బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మాత్రమే కాంగ్రెస్ ను  ప్రజలు చూశారని ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube