'హనుమాన్' గ్రాఫిక్స్ విషయంలో మరింత శ్రద్ధ.. ఆ సినిమానే కారణమా?

ఇటీవలే పాన్ ఇండియా వ్యాప్తంగా ఆదిపురుష్ ( Adipurush )రిలీజ్ అయ్యి ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో తెలిసిన విషయమే.ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు భారీ తారాగణం ఉన్న బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ( Om Raut ) తెరకెక్కించిన 500 కోట్లు పెట్టిన ఈ సినిమా రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.

 Prasanth Varma Hanuman Vfx Work Update, Hanuman, Prasanth Varma, Teja Sajja,-TeluguStop.com

ఇది డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది.ఆడియెన్స్ నుండి నెగిటివ్ కామెంట్స్ రావడమే ఇందుకు కారణం.

మరి మన టాలీవుడ్ నుండి రాబోతున్న బిగ్గెస్ట్ విజువల్ అండ్ గ్రాఫిక్స్ కలిగిన సినిమా ఏది అంటే ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘హనుమాన్‘ ( HanuMan ) అనే చెప్పాలి.యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా ( Teja Sajja )అమృత అయ్యర్ ( Amritha Aiyer ) హీరోయిన్ గా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ”హను-మాన్”.

ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.

టీజర్ రిలీజ్ తో అంచనాలు భారీగా పెంచుకున్న ఈ సినిమా పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.దీంతో ఈ సినిమాపై మరింత మేకర్స్ మరింత శ్రద్ధ పెడుతున్నారు.ఆదిపురుష్ వంటి భారీ సినిమా విషయంలో చేసిన తప్పులను ఈ సినిమా విషయంలో జరగకుండా చుస్తున్నట్టు అనిపిస్తుంది.

అందుకే గ్రాఫిక్స్ విషయంలో ఏ చిన్న మిస్టేక్ కూడా లేకుండా ప్రశాంత్ వర్మ మరింత డిటెయిల్ గా కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

తాజాగా ఈ సినిమా నుండి గ్రాఫిక్స్ పరంగా ఏ చిన్న మిస్టేక్ లేకుండా వర్క్ చేస్తున్నామని సిజి వర్క్ జరుగుతున్న మానిటర్ పిక్ షేర్ చేసి తెలిపాడు.మరి హనుమాన్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.ఇక ఈ సినిమా యూనివర్శల్ సబ్జెక్ట్ కావడంతో పాన్ వరల్డ్ లెవల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

గతంలో వాయిదా పడ్డ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube