గత కొద్ది రోజులుగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరబోతున్నారనే ప్రచారం ఓ వైపు జరుగుతుండగా , రాజకీయ వ్యూహకర్తగా పని చేసేందుకు కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం మరోవైపు జరుగుతోంది.
కేంద్రంలో మరోసారి బిజెపి అధికారంలోకి రాకుండా చేసేందుకు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా టిడిపి నేత జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మోహబూబా మస్తీ కూడా సోనియాతో ఈ సందర్భంగా భేటీ అయ్యారు.ఈ ముగ్గురు కీలకమైన రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం.
కాశ్మీర్ లోయలో ఎన్నికల రంగం సిద్ధం చేసేందుకు మహబూబా మస్తీ కాంగ్రెస్ తో కలిసి పని చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.బిజెపిని అధికారంలోకి రాకుండా చేసేందుకు గత కొద్ది రోజులుగా కేంద్ర అధికార పార్టీ బిజెపిని వ్యతిరేకించే పార్టీలతో ప్రశాంత్ కిషోర్ చర్చలు జరుపుతున్నారు.
బిజెపికి దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెంచేందుకు కృషి చేస్తున్నారు.రాబోయే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి ఆ పార్టీ అధికారంలోకి రాకుండా చేసేందుకు ప్రశాంత్ కిషోర్ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఇదే విషయాన్ని సోనియాతో భేటీ సందర్భంగా వివరించినట్లు సమాచారం.

ఇదే కాకుండా అతి త్వరలోనే అధికారికంగా చేరాలని ప్రశాంత్ కిషోర్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.తమ పార్టీకి రాజకీయ వ్యూహాలు అందించడంతో పాటు , పార్టీలో చేరితే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు మంచి ఊపు వస్తుందని, అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమి కాదనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.వివిధ రాష్ట్రాల్లోని బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలకు ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ టీం పని చేస్తోంది.
ఈ మేరకు కీలక ఒప్పందాలు చేసుకుంది.ప్రశాంత్ కిషోర్ అండదండలతో కాంగ్రెస్ కు పునర్వైభవం వస్తుందనే ఆశాభావం ఆ పార్టీ నాయకులు ,కార్యకర్తలలో స్పష్టంగా కనిపిస్తోంది.







