వైసీపీకి కష్టకాలం ? రంగంలోకి ప్రశాంత్ కిషోర్

రాజకీయంగా వైసీపీ ప్రభుత్వం బలంగానే ఉన్నా, ప్రజల్లో ఆ పార్టీకి మంచి ఆదరణ ఉన్నా, ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.రాజకీయ శత్రువులు అంతా ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం పై రాజకీయ దాడి మొదలుపెట్టారు.

 Jagan Prasanth Kishore Ap Government Tdp Bjp Janasena Elections , Ap Government-TeluguStop.com

త్వరలోనే తిరుపతి ఉప ఎన్నికలతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు యాక్టివ్ అయ్యాయి.దీనికి తగ్గట్టుగానే ఏపీలో వివిధ ప్రాంతాల్లో దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసమవుతున్న ఘటనలు వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.

రాజకీయ ప్రత్యర్ధులకు అదే ఆయుధంగా మారింది.ఒక రకంగా ఏపీ ప్రభుత్వం జనాల్లో అభాసుపాలు అవడంతో పాటు, రాజకీయంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఇక మీడియాలోనూ అదేపనిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తుండడం వంటివి తలనొప్పిగా మారాయి.

ఇదిలా ఉంటే ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, అవి పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఇక తమ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ రంగంలోకి దించింది.2019 ఎన్నికలకు ముందు వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ వ్యూహాలతో ప్రధాన ప్రత్యర్థి టిడిపిని ఎన్నో రకాలుగా ఇరుకున పెట్టారు. తెలుగుదేశం పార్టీ కి అంత ఘోరమైన ఫలితాలు, వైసీపీకి ఇంతటి భారీ విజయం దక్కేలా చేయడంలో ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు బాగా పని చేశాయి.

ఈ విషయాన్ని వైసీపీ నాయకులు అంతా ఒప్పుకుంటారు .

Telugu Ap Sheems, Pack, Jagan, Janasena, Ramathirdam, Tadepalli Guest, Ysrcp-Tel

ఇక వైసీపీ ఘన విజయంతో ప్రశాంత్ కిషోర్ డిమాండ్ దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది.అనేక రాజకీయ పార్టీలు ఆయన సేవలను ఉపయోగించుకుంటూ ఉండడంతో ఆయన బిజీగా మారారు.ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఆయన పనిచేస్తున్నారు.

అయితే ఏపీ లో ఈ పరిస్థితి తలెత్తడంతో జగన్ పీకే కు కబురు పంపగా, ఆయన ఆగ మేఘాల మీద ఏపీ లోని తాడేపల్లి లో సీఎం నివాసం లో సుమారు గంటన్నర సేపు చర్చలు జరిపారు.ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో గట్టెక్కడం తో పాటు, ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, దీనికోసం సామాజిక మాధ్యమాల ద్వారా అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ కు ప్రశాంత్ కిషోర్ సూచనలు చేసినట్లు తెలుస్తోంది.విజయవాడలో గత టిడిపి ప్రభుత్వం కూలగొట్టిన ఆలయాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో పునర్నిర్మిస్తున్నాము అంటూ జగన్ ప్రకటించారు.

సాంప్రదాయ దుస్తులు ధరించి మరి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వంటివి కూడా పీకే సలహా లేనని తెలుస్తోంది.విగ్రహాల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వాన్ని బయటపడేయడంతో పాటు, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే ప్రభుత్వ పథకాల ప్రచార వ్యవహారాలను ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇక పర్యవేక్షించబోతున్నట్టు తెలుస్తోంది.

పీకే రాకతో జగన్ లో కాస్త ధీమా పెరిగినట్లుగా వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube