బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) ఎట్టకేలకు ఒక హిట్ అందుకున్నాడు.గత ఆరేళ్లుగా హిట్ అందుకోలేక పోవడంతో ఈయన నుండి బ్లాక్ బస్టర్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూడగా ఎట్టకేలకు తాజా సినిమాతో అలాంటి హిట్ సొంతం అయ్యింది.
ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ”సలార్”( Salaar ).ఈ సినిమా డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవ్వగా రిలీజ్ అయ్యిన అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.ఈ సినిమాతో అప్పుడే ప్రభాస్ 500 కోట్ల మార్క్ ను క్రాస్ చేసాడు.

ఇదిలా ఉండగా తన నెక్స్ట్ లైనప్ కూడా పెద్దదే అని చెప్పాలి.ప్రజెంట్ నాగ్ అశ్విన్( Nag Ashwin ) తో కల్కి చేస్తున్నాడు.దీంతో పాటు మారుతి దర్శకత్వంలో మరో సినిమా, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమాలు లైనప్ లో ఉన్నాయి.
మరి ఈ సినిమాల్లో కల్కి సినిమాతో పాటు మారుతి ప్రాజెక్ట్ కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా వరకు పూర్తి చేసుకున్నాయి.

ఇక సందీప్ రెడ్డి వంగతో చేస్తున్న స్పిరిట్ అయితే ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు.స్టార్ట్ చేసిన రెండు సినిమాలు పూర్తి అయితే ప్రభాస్ ఈ సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి వంగ బ్రదర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సందీప్ రెడ్డి వంగ బ్రదర్ ప్రణయ్ రెడ్డి వంగ ( Pranay Reddy Vanga )స్పిరిట్ సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేసారు.ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని.
సందీప్ సినిమాల్లోని హీరో పాత్రల మాదిరిగానే ఇది కూడా పవర్ ఫుల్ గా అదిరిపోతోందని ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను అంటూ చెప్పుకొచ్చారు.మరి ఈ సినిమా స్టార్ట్ అవ్వకుండానే హోప్స్ పెంచేస్తుంది.







