కేటీఆర్ నిజమైన నాయకుడంటూ.. : ప్రకాష్ రాజ్

నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్బంగా.

సినీ, రాజకీయ, క్రీడా, బిజినెస్, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఎవరికి వారు తమదైన శైలిలో కేటీఆర్‌కు విషెస్ చెప్పి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.సోషల్ మీడియా వేదికగా ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.

ఈ క్రమంలో సిని సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్‌కు సంబంధించిన ప్రత్యేకమైన వీడియోను పోస్టు చేశారు.విపత్తు వచ్చినప్పుడు ప్రజల వెన్నుతట్టి నిలబడేవాడే నిజమైన నాయకుడు! తెలంగాణలో ఆ బాధ్యత సమర్థంగా భుజానికెత్తుకున్న నాయకుడు మన కేటీఆర్ అని ప్రకాష్ రాజ్ మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేక వీడియో ద్వారా ప్రశంసించారు.

అలాగే `డియర్ ఫ్రెండ్ కేటీఆర్‌కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు.నువ్వు మరింత ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలని కోరుకుంటున్నా.

Advertisement

ధన్యవాదాలు` అని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా తమ మధ్య బంధాన్ని చాటుకున్నారు. ప్రకాష్ రాజ్ ట్విట్‌కు మెని థ్యాంక్స్ ప్రకాష్ అంటూ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా బదులు ఇచ్చారు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..
Advertisement

తాజా వార్తలు