భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో వేర్వేరు పాత్రల్లో నటిస్తున్న ప్రకాష్ రాజ్ నటనకు జాతీయ అవార్డులు సైతం దక్కాయి.వ్యవసాయం చేయడం ఇష్టం లేక ప్రకాష్ రాజ్ బెంగళూరుకు పారిపోయి వచ్చారు.
తెలుగులో కొన్ని సినిమాల్లో ప్రకాష్ రాజ్ సహాయ నటుడిగా నటించగా మరికొన్ని సినిమాల్లో విలన్ రోల్స్ లో నటించారు.గతంలో కొన్ని వివాదాల ద్వారా ప్రకాష్ రాజ్ పేరు వార్తల్లో వినిపించిన సంగతి తెలిసిందే.
స్క్రిప్ట్ ఇస్తే నాకు మనస్సాక్షికి నచ్చాలని ప్రకాష్ రాజ్ అన్నారు.మేకప్ వేసుకునే ముందే ఈరోజు ఏ సీన్ లో నటిస్తానో తెలుసుకుంటానని ప్రకాష్ రాజ్ అన్నారు.
నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు డైలాగ్ తనకు నచ్చలేదని కానీ ఆ సినిమా ఊహించని స్థాయిలో హిట్ అయిందని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.ముక్కుసూటి మనస్తత్వం వల్ల ప్రశాంతంగా ఉన్నానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.
ఈ విధంగా ఉండటం వల్ల తన జీవితానికి అర్హత ఉందని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.మనిషి శ్రీమంతుడు కావడం కంటే కోల్పోయేంత శ్రీమంతుడు కావాలని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.
కొన్ని కథలు నాకు చెప్పాలని అనిపిస్తుందని అందుకే కొన్ని సినిమాలను తాను డైరెక్షన్ చేశానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.కథ నచ్చిన కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చెయ్యాలని అనిపిస్తుందని ప్రకాష్ రాజ్ ఆన్నారు.

తనకు మేనేజర్స్ లేరని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.తాను రూపాయి తీసుకొని సినిమాల్లో నటిస్తానని కొన్ని సినిమాలకు కోటి రూపాయలు కూడా తీసుకుంటానని రూపాయి కూడా తీసుకోకుండా అవసరమైతే నటిస్తానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు పోటీ చేస్తున్నారనే విషయం తెలిసిందే.మెగా కాంపౌండ్ మద్దతు ఉండటంతో ప్రకాష్ రాజ్ కు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వస్తాయేమో చూడాలి.