ఆ స్టార్ కమెడియన్ తన కోరిక తీర్చాలంటూ వేధించాడని అంటున్నప్రగతి...

సినీ పరిశ్రమ ఏదైనా క్యాస్టింగ్ కౌచ్ సమస్య మాత్రం కామన్ గా ఉంటుంది.

ఇందులో ఎక్కువగా సినీ పరిశ్రమలో పెద్ద వాళ్ళుగా చలామణి అవుతున్నటువంటి కొందరు అవకాశాల పేరుతో నూతన యువతీ, యువకులకు, లేదా చిన్న తరహా నటీనటులను లోబరుచుకునే యత్నాలకు చేస్తుంటారు.

అయితే తాజాగా సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే విషయంపై తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి స్పందించింది.ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎదుర్కున్నటువంటి లైంగిక వేధింపుల గురించి పలు అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

Pragathi, Telugu Actress, Tollywood Character Artist, Sensational Comments, Ca

తాను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో అవకాశాల కోసం చాలా కాలం పాటు ఎదురు చూశానని ఆ తర్వాత అనుకోకుండా తనకు సినిమా పరిశ్రమలో తెలిసినటువంటి వాళ్ల ద్వారా సినిమాలో నటించే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చింది.అయితే ఇందులో భాగంగా మొదట్లో తెలుగు సినిమా పరిశ్రమకి చెందినటువంటి ఓ స్టార్ కమెడియన్ తనని లైంగికంగా వేధించాడని తెలిపింది.

అంతేగాక అతడితో కలిసి నటిస్తున్నటువంటి సమయంలో తన కోరిక తీర్చాలంటూ కొంత మేర ఇబ్బంది పెట్టాడని వాపోయింది.అలాగే అతడు ఓ సీనియర్ కమెడియన్ అయినప్పటికీ అతని ప్రవర్తన, తీరు నచ్చకపోవడంతో దూరం పెట్టానని చెప్పుకొచ్చింది.

Advertisement

అయితే అతడిని పలుమార్లు తనతో ఆ విధంగా ప్రవర్తించద్దంటూ చెప్పినప్పటికీ వినకపోవడంతో ఓసారి బలంగా హెచ్చరించారని, దీంతో అప్పటి నుంచి ఆ సీనియర్ కమెడియన్ తనతో మళ్లీ ఎప్పుడు అలా ప్రవర్తించలేదని తెలిపింది.కాబట్టి సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు వెళితే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని, ఎవరో కొందరు చేసేటువంటి పనులకి అందరినీ నిందించటం సరికాదని అంటోంది ప్రగతి.

అయితే ప్రస్తుతం ప్రగతి పలుసార్లు హీరోల చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.ఈమె నటించిన చిత్రాల్లో ఎక్కువగా తల్లి, అక్క, వదిన వంటి పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.

Advertisement

తాజా వార్తలు