తెలుగు బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇలా యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రదీప్ మాచిరాజు.
ఈయన గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగడమే కాకుండా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కూడా నటించారు.అయితే గత రెండు సంవత్సరాల క్రితం ప్రదీప్ హీరోగా 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇకపోతే ఈ సినిమా పరవాలేదు అనిపించింది.
ఈ సినిమా అనంతరం ప్రదీప్ ఇప్పటివరకు మరి ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు.
అయితే ఈయన సినిమాలు చేయనప్పటికీ యాంకర్ గా బుల్లితెరపై మాత్రం ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రదీప్ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇలా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రదీప్ ఒక కార్యక్రమంలో ఒకరోజు షూటింగ్ లో పాల్గొంటే భారీగానే రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నారని ఇండస్ట్రీ టాక్.ఈయన కేవలం ఒక్క కాల్ షీట్ కిదాదాపు 5 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.ఇలా ఒక్క కాల్ షీట్ కు 5 లక్షలు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
ఈ విధంగా ఒక ఎపిసోడ్ కు లక్షల రెమ్యూనరేషన్ అంటే ప్రదీప్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మనం ఊహించుకోవచ్చు.ఇక సినిమాల విషయానికొస్తే తనకు అనుగుణమైన కథ దొరికితే తప్పకుండా సినిమాలలో నటిస్తానని ప్రదీప్ వెల్లడించారు.