Prabhas : ప్రభాస్ అర్ధరాత్రి వరకు ఆ పని చేసేవారా.. అసలు సీక్రెట్ బయటపెట్టిన ప్రభాస్ శీను?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.

బాహుబలి సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఇక బాహుబలి తర్వాత ఆశించిన స్థాయిలో ప్రభాస్ పెద్దగా సక్సెస్ అందుకోలేదు.

ఇలా వరుస సినిమాలు ఫెయిల్యూర్ కావడంతో ప్రభాస్ అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేశారు.

ఇకపోతే గత ఏడాది చివరిలో ప్రభాస్ నటించిన సలార్ ( Salaar ) సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక త్వరలోనే ఈయన నటించిన కల్కి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాలతో పాటు రాజా సాబ్, స్పిరిట్ వంటి సినిమాలు కూడా షూటింగ్ పనులను జరుపుకుంటూ ఉన్నాయి.

Advertisement

ఇలా ప్రస్తుతం ప్రభాస్ సినిమాల పరంగా బిజీ అయ్యి తన స్నేహితులను కలవడం లేదు కానీ ఒకప్పుడు ఈయన తన స్నేహితులతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు అంటూ తాజాగా ప్రభాస్ స్నేహితుడు ప్రభాస్ శ్రీను ( Prabhas Sreenu ) తెలిపారు.

ప్రభాస్ కెరియర్ మొదటి నుంచి ఆయన టాలీవుడ్ సినిమాలలో ప్రభాస్ శ్రీను కూడా కనిపిస్తూ ఉంటారు.తాజాగా ప్రభాస్ గురించి ఈయన మాట్లాడుతూ ప్రభాస్ కు ఇప్పుడు టైం కుదరలేదు కానీ ఒకప్పుడు స్నేహితులతోనే ఎక్కువగా గడిపేవారని,అర్ధరాత్రి వరకు కలిసి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేవారని తెలిపారు.ప్రభాస్ ఎక్కువగా ఫుట్ బాల్ ఆడుతూ అందరితో సరదాగా గడిపేవారని ప్రభాస్ శ్రీను తెలిపారు.

ఇక ఇప్పుడు ఈయన పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ఏమాత్రం తీరిక లేకుండా ఉంది అంటూ ప్రభాస్ శ్రీను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు