యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.ఈయన సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
మరి ప్రభాస్ ప్రాజెక్టుల్లో భారీ అంచనాలు ఉన్న పాన్ ఇండియన్ మూవీ ”సలార్”( Salaar ).సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే భారీ హోప్స్ నెలకొన్నాయి.క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ చేసి హోప్స్ మరింతగా పెంచేశారు.ఇక రిలీజ్ కు వారం మాత్రమే ఉండడంతో ఈ సినిమా కోసం ఎదురు చూసే వారు మరింతగా పెరుగుతున్నారు.
ఇదిలా ఉండగా సలార్ సినిమాను ఓవర్సీస్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
యూఎస్ లో భారీ రిలీజ్ ఉండగా ఇప్పటికే అదే రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి.అయితే తాజాగా యుఎస్ లో ఈ సినిమా ఐమాక్స్ వర్షన్ లో రిలీజ్ చేయడం లేదని చెప్పి షాక్ ఇచ్చారు.కొద్దిరోజుల ముందు ఐమాక్స్ వర్షన్ లో భారీ స్థాయిలో రిలీజ్ ఉందని చెప్పి ఇప్పుడు లేదని చెప్పడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.
చివరి నిముషంలో చెబితే మరింత డిజప్పోయింట్ అవుతారని అందుకే ముందుగానే చెబుతున్నట్టు మేకర్స్ చెప్పుకొచ్చారు.కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.