ప్రభాస్ హీరో గా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వం లో రూపొందిన సలార్ సినిమా ( Salaar movie )ను క్రిస్మస్ కానుకగా ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యి చాలా కాలం అయింది.
కానీ ఏదో ఒక కారణం వల్ల వాయిదా పడుతూ వచ్చింది.వాయిదా పడినా కొద్ది సినిమా స్థాయి పెరుగుతూనే వచ్చింది.

ఇప్పుడు సినిమా కి సంబంధించిన హైప్ ఎంతగా ఉందంటే ప్రభాస్ అభిమానులు ( Prabhas fans ) వేల రూపాయలు పెట్టి టికెట్లు కొనుగోలు చేయాలని సిద్ధంగా ఉన్నారు.ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రేమికులు కూడా సినిమాను చూసేందుకు వేలకు వేలు ఖర్చు పెట్టేందుకు సిద్ధం అన్నట్లుగా ఉన్నారు.సినిమా కు వచ్చిన హైప్ నేపథ్యం లో నిర్మాతలు బయ్యర్లు భారీ ఎత్తున టికెట్ల రేట్లు పెంచేశారు.కర్ణాటకలో సలార్ సినిమా యొక్క టికెట్ల రేట్లు సామాన్యులకు అందనంత దూరం లో ఉన్నాయి అంటూ విమర్శలు వస్తున్నాయి.
కన్నడ మీడియా కథనాల అనుసారం గా సలార్ సినిమా ను( Salaar movie ) ఒక్కరు మల్టీ ప్లెక్స్ లో చూడాలి అంటే కనీసం 750 నుంచి 1000 రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇక ఒక్కరు సింగిల్ స్క్రీన్ థియేటర్ లో చూడాలి అంటే 350 నుంచి 500 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉందట.తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయి లో సినిమా కు టికెట్ల రేట్ల పెంపుకు ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు.ఏపీ లో 40 రూపాయలు పెంచేందుకు అనుమతులు ఇచ్చింది.
అయితే నైజాం ఏరియా నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.నేడు సాయంత్రం వరకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సలార్ సినిమా( Salaar movie ) వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేయాలి అంటే కచ్చితంగా భారీ గా టికెట్ల రేట్లు పెరగాల్సిన అవసరం ఉంది.