రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )హీరోగా రూపొందిన సలార్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.కేజీఎఫ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వం లో రూపొందిన సలార్ సినిమా( Salaar movie ) ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు.
డిసెంబర్ 22న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయింది.టికెట్ల రేట్ల పెంపు విషయం లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలస్యం చేయడం తో కాస్త ఆలస్యంగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అయింది.
సాధారణంగా అడ్వాన్స్ బుకింగ్ ను ఆన్ లైన్ ద్వారా మొదలు పెడతారు.

కానీ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా విడుదల హక్కులు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే.వారు ఈ సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్ ను థియేటర్ల వద్ద చేయబోతున్నట్లుగా ప్రకటించారు.సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరడంతో జనాలు ఆన్ లైన్ విధానం ఉండగా ఇలా ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
బుకింగ్ కౌంటర్ ల వద్ద సినిమా టికెట్లు ఇస్తే బ్లాక్ టికెట్లు పెరిగే అవకాశం ఉంటుంది.ఆ విషయం పట్టించుకోకుండా ఎందుకు మైత్రి వారు ఇలా చేశారు అన్న ప్రశ్నకు కొందరు ప్రమోషన్ స్టంట్, పబ్లిసిటీ స్టంట్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇలా చేయడం వల్ల పబ్లిసిటీ దక్కుతుందని వారు భావించి ఉంటారు.అందుకే రోడ్ల పైకి ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చి, నానా రచ్చ చేసే విధంగా చేశారు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.మొత్తానికి సలార్ కి ఇప్పటికే దక్కిన పబ్లిసిటీ కి తోడు తాజాగా సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్( Salar movie advance booking ) పేరుతో చేసిన హడావుడి తో మరింత రచ్చ మొదలైంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.వెయ్యి కోట్ల వసూళ్ల తో ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.