ప్రభాస్ 'సలార్‌ 2' గురించి ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్( Prabhas ) హీరో గా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వం లో రూపొందుతున్న సలార్‌ సినిమా విడుదల విషయం లో గందరగోళ పరిస్థితిలు నెలకొన్నాయి.

ఇప్పటికే సలార్ 1 సినిమా ను ఈ నెల లో విడుదల చేయాలని భావించి మళ్లీ వాయిదా వేయడం జరిగింది.

కొత్త విడుదల తేదీ విషయం లో క్లారిటీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అదుగో ఇదుగో అంటూ సలార్‌ 1 సినిమా( Salaar movie 1 ) విడుదల తేదీ విషయం లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సలార్‌ 1 సినిమా ను సెప్టెంబర్‌ లో విడుదల చేసి ఉంటే సలార్ 2 ను కచ్చితంగా వచ్చే ఏడాది లో విడుదల చేసే అవకాశం ఉండేది.కానీ ఇప్పుడు సలార్ 1 విడుదలకు చాలా సమయం ఉన్న కారణం గా సలార్ 2 సినిమా విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ విడుదల విషయం లో ఫ్యాన్స్ ని నిరాశ పరిచాడు.

సలార్‌ 1 విడుదల కోసం రెండేళ్లు గా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి వాయిదా పడటం తో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

శృతి హాసన్‌( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో ప్రభాస్ ద్వి పాత్రాభినయం చేయడం జరిగిందని తెలుస్తోంది.రెండు పార్ట్ లు గా రాబోతున్న సలార్‌ సినిమా వెయ్యి కోట్లు వసూళ్లు సాదించడం ఖాయం అన్నట్లుగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.సలార్‌ సినిమా కి ముందు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వచ్చిన కేజీఎఫ్ 2 వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే.

కేజీఎఫ్ సినిమా తరహా లోనే సలార్ సినిమా ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు.కనుక సినిమా ప్రమోషన్‌ ను ఇప్పటి నుండే మొదలు పెడితే బాగుంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సలార్ 2 సినిమా విడుదల విషయం లో ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు