పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన సలార్(Salaar) సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది .ఈ సినిమా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కింది.
ప్రభాస్ శృతిహాసన్(Shruti Haasan), పృధ్విరాజ్ సుకుమారన్,(Prithviraj Sukumaran) జగపతిబాబు, సప్తగిరి ఈశ్వరి రావు వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటించినటువంటి ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు డిసెంబర్ 22 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ద్వారా ప్రభాస్ ఎలాంటి సక్సెస్ అందుకోబోతున్నారు అసలు ఈ సినిమా కథ ఏంటి అనే విషయాన్ని వస్తే…
కథ:
దేవా అలియాస్ సలార్ (ప్రభాస్) అసోంలోని ఓ ప్రాంతంలోని బొగ్గు గనిలో( Coal Mine ) పనిచేస్తుంటాడు.ఆ ప్రాంతానికి ఆధ్యను (శృతిహాసన్)(Aadya) కిడ్నాప్ చేసి తీసుకు రావడంతో అక్కడ కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి.అయితే శృతిహాసన్ ని అక్కడ ఉపాధ్యాయులు కొందరు తీసుకెళ్లి పోవాలని చూడగా వారి నుంచి దేవా(Deva) ఆద్యను కాపాడుతారు.
అలా వీరిద్దరి మధ్య పరిచయం మొదలవుతుంది ఇక చిన్నప్పుడు తన స్నేహితుడిని వదిలి వెళ్ళిన వరదరాజ మన్నార్( పృథ్విరాజ్ సుకుమారన్)(Varadaraja Mannar) 25 సంవత్సరాలకు తన స్నేహితుడిని వెతుక్కుంటూ అస్సాం వస్తారు.
అసలు దేవా తన తల్లి ఈశ్వరి రావు తో కలిసి అక్కడ ఎందుకు ఉన్నారు? ప్రాంతానికి ఆధ్యను ఎందుకు తీసుకొస్తారు? భారత సరిహద్దులోని ఖాన్సార్ ఆటవీ ప్రాంతం ఓ రాజ్యంగా ఎలా మారింది.ఆ ప్రాంతాన్ని శాసించే మన్నార్ వంశానికి ఎలాంటి సవాల్ ఎదురైంది.ఖాన్సార్ ప్రాంతంలో యుద్ధ విరమణ (CeaseFire) ఒప్పందాన్ని ఎత్తివేయడానికి ఎందుకు ఓటింగ్ పెట్టారు? అసలు దేవాకు మన్నార్ వంశానికి సంబంధం ఏమిటి అనే విషయాలన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
దేవా పాటలు ప్రభాస్ మరోసారి తన నటన విశ్వరూపాన్ని చూపించారు.ఈ సినిమా చూస్తే కనుక చత్రపతి రేంజ్ లో ఈయన యాక్షన్ సన్నివేశాలలో నటించారని చెప్పాలి.కాటేరమ్మ ఎపిసోడ్, విష్ణు తండ్రితో ఉండే రెండు ఎపిసోడ్‌లు మళ్లీ పాత ప్రభాస్‌ను గుర్తు చేస్తాయి.ఇక వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ అదరగొట్టాడు.శృతిహాసన్ కథను డ్రైవ్ చేసే పాత్రలో కనిపించింది.ఈశ్వరీరావు, జగపతిబాబు, తదితరులు వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ విభాగానికి వస్తే డైరెక్టర్ ప్రశాంత్(Prashanth Neel) మరోసారి తన మార్క్ చూపించారు.సింపుల్ కథతో అయినప్పటికీ సినిమాని ఎంతో అద్భుతంగా ప్రేక్షకులకు పరిచయం చేశారు.ఈయన స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని చెప్పాలి.మ్యూజిక్ విషయానికి వస్తే రవి బస్రూర్ మ్యూజిక్ సినిమాను ఊహించని విధంగా ఎలివేట్ చేశాయి.ముఖ్యంగా రవి బస్రూర్( Ravi Basrur ) బీజీఎం సెకండాఫ్‌లో ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి.యాక్షన్ సీన్లను చిత్రీకరించిన తీరు సినిమాకు మరో హైలెట్.
హోంబలే బ్యానర్ ప్రమాణాలకు తగినట్టుగా నిర్మాణ విలువలు ఉన్నాయి.నిర్మాతలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదని చెప్పాలి అలాగే సినిమా ఫోటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.
విశ్లేషణ:
దేవా, వరదరాజ మన్నార్ బాల్యంతో మంచి పవర్‌ఫుల్ ఎపిసోడ్‌తో సలార్ సినిమా మొదలవుతుంది.ఆ తర్వాత అసోంలోని బొగ్గు గనుల్లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడం, అలాగే ఆధ్య కిడ్నాప్ వ్యవహారం చకచకా జరిగిపోతాయి.ఫస్టాఫ్‌లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్ నుంచి ఓ నాయకుడిగా ఎదిగిన తీరు అద్భుతంగా అనిపించింది.ఇక సెకండ్ హాఫ్ అటవీ ప్రాంతంలో వచ్చే సన్నివేశాలు కూడా హైలెట్ అయ్యాయని చెప్పాలి.మొత్తానికి ఒక అద్భుతమైన సినిమాని ప్రశాంత్ ప్రేక్షకుల ముందుకు తీసుకోవచ్చి ఫాన్స్ ఆకలిని మొత్తం తీర్చారని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే, కథ, మ్యూజిక్, నటీనటుల నటన.
మైనస్ పాయింట్స్:
క్లైమాక్స్ సాగదీసి.సాగదీసి విసుగు తెప్పించేలా చేయడం ఓ మైనస్.
బాటమ్ లైన్:
యాక్షన్స్ సన్ని వేషాలతో కూడినటువంటి సినిమాలు ఎన్నో వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.మొత్తానికి బాహుబలి తర్వాత సలార్ ప్రభాస్ కి సూటయ్యే సినిమా అని చెప్పాలి.