ప్రభాస్ సలార్2 మూవీ టార్గెట్ లెక్కలివే.. ఆ రేంజ్ కలెక్షన్లు రావడం పక్కా!

డార్లింగ్ ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన చిత్రం సలార్.

( Salaar ) ఈ సినిమా విడుదల అయ్యి ఎంత డివిజన్ సాధించిందో మనందరికీ తెలిసిందే.

ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల అయ్యి కోట్లల్లో కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది.ఇకపోతే ఈ సినిమా పార్ట్ 2 ఉంటుందని ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా టార్గెట్ లెక్కలకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.

అదేమిటంటే ఇటీవల విడుదల అయినా పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో సినిమా బిజినెస్ లెక్కలు చాలా మారిపోయాయి.

Prabhas Prashanth Neel Salaar 2 With A Huge Target Details, Salaar 2, Tollywood,
Advertisement
Prabhas Prashanth Neel Salaar 2 With A Huge Target Details, Salaar 2, Tollywood,

సలార్ 2కి( Salaar 2 ) సంబంధించిన లెక్కలను కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో తియ్యబోయే మూవీ మొదలు సలార్ 2 వరకు అదే టార్గెట్ పెట్టుకుంటున్నారట.ప్రభాస్ తో చేసిన సలార్ 1 700 కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది.అదే విషయాన్ని ప్రశాంత్ నీల్ కూడా చెప్పారు.సలార్1 అనుకున్న అంచనాలను రీచ్ కాలేదు అని.అందుకే ఇప్పుడు ప్రశాంత్ నీల్ సలార్ 2 విషయంలో తగ్గేదెలా అంటున్నారు.బడ్జెట్ పరంగానే కాదు కలెక్షన్స్ పరంగాను సలార్ 2 2000 కోట్ల టార్గెట్ తో తెరకెక్కించాలనే ప్లాన్ చేసుకుంటున్నారట.

Prabhas Prashanth Neel Salaar 2 With A Huge Target Details, Salaar 2, Tollywood,

సలార్ పార్ట్ 1 లో జరిగిన మిస్టేక్స్ పార్ట్ 2 లో జరక్కుండా చూసుకోవాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట.అయితే ప్రశాంత్ నీల్, ప్రభాస్ ఎప్పుడు సలార్ 2 ని స్టార్ట్ చేస్తారో అనేది క్లారిటీ రావడం లేదు.కారణం ప్రభాస్ వరసగా రెండు సినిమాలను ఫినిష్ చెసే పనిలో ఉండగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో( NTR ) మూవీ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.

సో సలార్ 2 ఎప్పుడు స్టార్ట్ అవ్వుద్దో అని ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.ఈ సినిమా ఎక్కువ ఆలస్యం అయ్యే కొద్ది సినిమా పట్ల ఆసక్తి తగ్గుతుంది అని తొందరగా స్టార్ట్ చేయాలంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

కానీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీలతో బిజీ బిజీగా ఉన్నారు.మరి ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందో చూడాలి మరి.

సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఇదేనా..?
Advertisement

తాజా వార్తలు