పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.అయినా కూడా ఈయన కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు.
ప్రభాస్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలే.ఇక ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్లాప్ ఎదుర్కొన్నప్పటికీ ఈయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.
ప్రెజెంట్ ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తున్నాడు.ఇందులో ఆదిపురుష్ సినిమా షూట్ పూర్తి చేసుకుంది.
ఇక ఇప్పుడు సలార్ తో పాటు ప్రాజెక్ట్ కే షూటింగులతో బిజీగా ఉన్నాడు.ఈ రెండు చేస్తూనే మరో సినిమాను లైన్లో పెట్టాడు ప్రభాస్.
ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇటీవలే ఆగష్టు 25న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసారు.‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను కూడా మారుతి ఫిక్స్ చేసాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.అయితే ఈ టైటిల్ విషయంలో మారుతి ఆలోచనలలో పడ్డాడని తెలుస్తుంది.
ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

మరి అలాంటి సినిమాకు టైటిల్ ఎలా ఉండాలి. పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండాలి.స్క్రిప్ట్ అయితే పాన్ ఇండియాను ఆకట్టుకునే థ్రిల్లర్ సబ్జెక్టు ఎంచుకున్నాడు.
కానీ టైటిల్ విషయంలో కూడా అలాగే ఉండాలని రాజా డీలక్స్ అనేది తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అవుతుంది కాబట్టి మరో టైటిల్ ను వెతికే పనిలో ఉన్నారట.ఈ నెలలోనే షూట్ స్టార్ట్ కాబోతున్న ఈ సినిమాకు అన్ని భాషల్లో ఒకే టైటిల్ పెట్టాలని అందుకే మంచి పాన్ ఇండియా టైటిల్ కోసం చూస్తున్నాడని తెలుస్తుంది.







