తెలుగులో రాములమ్మగా పేరు తెచ్చుకుని అప్పట్లో హీరోలకు ధీటుగా యాక్టింగ్ లో మెప్పించిన హీరోయిన్ ఎవరంటే వెంటనే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అని చెబుతారు.ఈమె 90లలో స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
ఇక ఆ తర్వాత ఈమె యాక్టింగ్ మానేసి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వడమే కాకుండా.రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మంచి చేయాలని ఆశయంతో ఉంది.
అయితే ఈమె మళ్ళీ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటించి మెప్పించింది.ఎన్నో ఏళ్ల తర్వాత ఈమె ముఖానికి మ్యాకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చింది.
ఇక ఆ సినిమా సమయం లోనే ఈమె సినిమాల్లో నటించాలని పెద్దగా ఆశక్తి లేదని.మంచి పాత్రలు అయితేనే నటిస్తానని చెప్పుకొచ్చింది.ఆమె చెప్పినట్టుగానే చాలా అవకాశాలు వచ్చినా ఓకే చెప్పలేదు.ఇక తాజాగా ఈమె ఎన్టీఆర్ సినిమాలో నటిస్తుంది అని వార్తలు వస్తున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమాను కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.

ఈ సినిమాలో అలనాటి అందాల తార విజయశాంతి కూడా కీలక పాత్రలో నటిస్తుంది అని.ఎన్టీఆర్ కు అత్త పాత్రలో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ఈమె నటించ బోతుంది అని.వార్తలు వచ్చాయి.ఇక తాజాగా ఈమె ఈ సినిమాకు ఓకే చెప్పడానికి అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీనే కారణం అని అంటున్నారు.వీరిద్దరూ భేటీ తర్వాతనే ఈమె ఈ పాత్రకు ఓకే చెప్పిందని చెబుతున్నారు.
మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.







