ప్రభాస్ ( Prabhas )రాముడిగా, కృతి సనన్( Kriti Sanon ) సీతమ్మ గా నటించిన ఆదిపురుష్ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా గురించి ఓ రేంజ్ లో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
అయోధ్య రామ మందిరం గురించి ఏ స్థాయిలో అయితే దేశ వ్యాప్తంగా చర్చ జరిగిందో ఆదిపురుష్( Adipurush ) గురించి కూడా అదే విధంగా ప్రధానంగా చర్చ జరిగింది.మొత్తం దేశం లోని హిందువులు అంతా కూడా ఆదిపురుష్ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూడాలి అన్నట్లుగా కూడా ప్రచారం జరిగిన విషయం తెల్సిందే.
ఇక ఇప్పుడు మొత్తం అందరు కూడా ఆదిపురుష్ ను చూడాలి అన్నట్లుగా కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా కూడా ఆదిపురుష్ యొక్క హంగామా మొదలు అయ్యింది.ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ భారీ ఎత్తున జరుగుతోంది.రూ.550 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించిన విషయం తెల్సిందే.ఓం రౌత్ ( Om Rauth )దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ గ్రాఫిక్స్ మూవీ అంటూ రికార్డును సృష్టించబోతుంది.
రామాయణం ను ఇప్పటి వరకు ఇండియన్ సినీ ప్రేక్షకులు పదుల కొద్ది సినిమాలు మరియు సిరీస్ ల రూపంలో చూడటం జరిగింది.కానీ ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఆదిపురుష్ సినిమా తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసేందుకు… ముఖ్యంగా ఈ జనరేషన్ వారికి రామాయణం గురించి చెప్పాలనే ఉద్దేశ్యంతో ఓం రౌత్ ఈ సినిమాను చేయడం జరిగింది.
ప్రభాస్ రాముడిగా నటించడం వల్ల తెలుగు ప్రేక్షఖులతో పాటు సౌత్ ఆడియన్స్ మొత్తం కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో సినిమా కు సంబంధించిన బిజినెస్ ను చేయడం జరిగింది.
మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆదిపురుష్ రివ్యూ కోసం చూస్తూనే ఉండండి.







